మరో రైలు ప్రమాదం..బెంబేలెత్తుతున్న ప్రయాణికులు..!

న్యూఢిల్లీ నుంచి దర్భంగా వెళ్తున్న క్లోన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కోచ్ దగ్ధం కాగా మరో రెండు కోచ్‌లు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. వెంటనే అలర్ట్ అయిన ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.

New Update
మరో రైలు ప్రమాదం..బెంబేలెత్తుతున్న ప్రయాణికులు..!

A huge fire broke out in Clone Express: ఇప్పటికే వరుస రైలు ప్రమాదాలతో బెంబేలెత్తుతున్న ప్రయాణికులకు మరోసారి భయానక పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా, మరో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ప్రయాణికులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు.దేశంలో జరుగుతున్న వరుస రైలు ప్రమాదాలు ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రైలు ప్రయాణమంటేనే గజగజ వణికిపోయే పరిస్థితి తలెత్తుతోంది. తాజాగా దర్భంగా ఎక్స్ ప్రెస్ అగ్ని ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని ఇటావాలో జరిగింది.

న్యూఢిల్లీ నుంచి దర్భంగా వెళ్తున్న క్లోన్ ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒక కోచ్ దగ్ధం కాగా మరో రెండు కోచ్‌లు కూడా మంటల్లో చిక్కుకున్నాయి. ఢిల్లీ హౌరా రైల్వే మార్గంలోని సరాయ్ భూపత్ రైల్వే స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. బోగిల్లో మంటలు అంటుకోగానే ప్రయాణికులు వెంటనే ట్రైన్ నుంచి దూకి దూరంగా పరుగెత్తారు. అందుతున్న సమాచారం ప్రకారం ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు.

Also Read:జమ్మూ కశ్మీర్‌ లో పెను విషాదం..36 మంది దుర్మరణం..!!

అయితే ఈ ప్రమాదంలో రైల్వే ప్రయాణికుల సామాను పూర్తిగా మంటల్లో ధ్వంసం అయింది. ప్రమాదం జరిగిన వెంటనే రైలు ను నిలిపివేసిన లోకోపైలట్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరాతీస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ లోని విజయ నగరం జిల్లాలో రైలు పట్టాలు తప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారు. అంతకు ముందు ఒడిషాలో దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు