వైద్య ఆరోగ్య రంగంలో చారిత్రాత్మక ఘట్టం... కాలేయ వ్యాధి హెపటైటిస్ ఎకు వ్యాక్సిన్ కనుగొన్న హైదరాబాద్ సంస్థ కాలేయ వ్యాధి హెపటైటిస్ ఎ కు వ్యాక్సిన్ కనుగొన్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ..కాలేయ వ్యాధికి ‘హవీస్యూర్-ఆర్’అనే వ్యాక్సిన్ ను జనవరి 19 శుక్రవారం జరిగిన లాంచ్ ఈవెంట్ లో ఆవిష్కరించారు. By Nedunuri Srinivas 20 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Hepatitis A Vaccine: వైధ్య రంగంలో చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతం అయింది. కాలేయ వ్యాధి హెపటైటిస్ ఎకు వ్యాక్సిన్ కనుగొన్నారు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఫార్మా సంస్థ ఇండియన్ ఇమ్యునోలాజికల్స్ లిమిటెడ్ సంస్థ. కాలేయ వ్యాధికి సంభందించి ‘హవీస్యూర్-ఆర్’ (Havisure®)అనే వ్యాక్సిన్ ను ఆవిష్కరించింది. చిన్నారులు, కాలేయ వ్యాధితో బాధపడుతున్నవారు ఈ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుందని జనవరి 19 శుక్రవారం జరిగిన లాంచ్ ఈవెంట్ లో వెల్లడించారు. హెపటైటిస్ ఎ కు ‘హవీస్యూర్’ వ్యాక్సిన్ మన శరీరంలోని చాలా కేలకమైన ఆర్గాన్ అయిన కాలేయంకు ఉన్న ప్రాధాన్యతే వేరు. మన శరీరానికి హాని కలిగించే విషపదార్ధాలనుంచి మనకు రక్షణ కల్పిస్తూ 500 రకాల విధులను నిర్వహించే ఈ కాలేయానికి ముప్పు వాటిల్లితే ఎంతటి ప్రమాదమో ఊహించుకోండి. ఇలాంటి మేజర్ ఆర్గాన్ కాలేయానికి ‘హెపటైటిస్’ వ్యాధి సవాల్ విసిరితే ..దాన్ని చాలెంజ్ గా తీసుకుని హెపటైటిస్ ఎ కు ‘హవీస్యూర్’ (Havisure®) వ్యాక్సిన్‌ను తయారుచేసింది. ఈ సంస్థ శుక్రవారం (జనవరి 19) హైదరాబాద్‌లోని హయత్ ప్లేస్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఈ టీకాను లాంచ్ చేశారు. భారతదేశం పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతోన వ్యాక్సిన్ అభివృద్ధి చేయడం జరిగిందని నిపుణుల బృందం తెలిపారు. టీం కృషితో విస్తృతమైన పరిశోధన, అనంతరం ఈ వ్యాక్సిన్ Havisure® ను ప్రజల ముందుకు తీసుకొచ్చారని చెప్పారు. హెపటైటిస్ ఎ ఎలా వ్యాపిస్తుంది? హెపటైటిస్ ఎ చాలా ప్రమాదకారి. ఎ మాత్రం అపరిశుబ్రంగా ఉన్న సరే ,, ఈ వ్యాధి సోకే అవకశాలు ఎక్కువ. ముఖ్యంగా కలుషితమైన డ్రింకింగ్ వాటర్ , పాడయిపోయిన ఆహారం కారణంగా ఈ వ్యాధి సోకుతుంది,ఇలాంటి ప్రమాదకర వైరస్ ను కాలేయానికి సోకకుండా నివారించడంలో హెపటైటిస్ ఎ వ్యాక్సిన్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు రెండు డోసుల టీకా ఈ వ్యాక్సిన్ రెండు-డోసులు తీసుకోవాల్సి ఉంటుందని ఈ లాంచ్ ఈవెంట్ లో తెలిపారు. ఏడాది వయసు పూర్తయిన చిన్నారులకు మొదటి డోసు.. మొదటి డోసు తీసుకున్న 6 నెలల తర్వాత రెండో డోసు వ్యాక్సిన్ ఇవ్వాలని తెలిపారు. కాలేయ సంబంధిత రుగ్మతలతో బాధపడేవారు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్నని చెప్పారు. డిమాండ్‌కు అనుగుణంగా ఈ వ్యాక్సిన్ ఉత్పత్తి హెపటైటిస్ A గురించి అవగాహన కలిగించే సెమినార్లు , కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వ సంస్థలతో కలిసి ముందుకు వెళ్లేందుకు సిద్దమని ఈ కార్యక్రమంలో తెలిపారు. డిమాండ్‌కు అనుగుణంగా ఈ వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయడానికి తమ సంస్థ సిద్ధంగా ఉందని ఐఐఎల్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ ప్రియబ్రత పట్నాయక్ తెలిపారు. అయితే మనదేశం ఇంతవరకు ఈ కాలేయ వ్యాధికి వ్యాక్శిన్ ను విదేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక.. ఎలాంటి వ్యాక్సిన్ కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని , హైదరాబాద్‌లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో వ్యాక్సిన్ గురించి కీలక వివరాలు వెల్లడించారు. ALSO READ: 28 ఏళ్ల తరువాత విశ్వ సుందరి పోటీలకు ఆతిధ్యం ఇవ్వనున్న భారత్ #kcr-health-updates #hepatitis-a #havisure #nddb #iil మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి