ఇజ్రాయల్ కు హర్యానా యువకులు..జీతం రూ1.37వేలు

ఇజ్రాయెల్ లో ఉద్యోగాల కోసం హర్యానా నుంచి 530 మంది యువకులు వెళ్లారు. ఈ ఉద్యోగ అవకాశాలు కల్పించిన హర్యానా ప్రభుత్వానికి వారు కృజ్జతలు తెలిపారు. ప్రస్తుతం ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధవాతావరణం చోటు చేసుకోవటంతో అక్కడ ఉద్యోగుల కొరత ఏర్పడింది.

ఇజ్రాయల్ కు హర్యానా యువకులు..జీతం రూ1.37వేలు
New Update

530 మంది యువకుల బృందం హర్యానా నుండి ఇజ్రాయెల్‌లో ఉద్యోగాల కోసం బయలుదేరింది. ఈ యువతను హర్యానా స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్  రోహ్‌తక్‌లో  ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసింది. మంగళవారం ఆ యువకులు న్యూఢిల్లీ నుండి ఇజ్రాయెల్‌కు వెళ్లారు. ఇజ్రాయెల్ వెళ్లే ముందు సీఎం నయాబ్ సైనీ, మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఆ యువకులతో మాట్లాడారు.

ఇజ్రాయెల్‌లో హర్యానా ప్రభుత్వంకు సంబంధించిన కంపెనీలతో సంబంధాలు ఉన్నాయి.ఈ క్రమంలో, ఇజ్రాయెల్ లో ఉద్యోగవకాశాల పేరిట రిక్యూర్ మెంట్ నిర్వహించింది. జనవరి నెలలో రోహ్‌తక్‌లో ఆరు రోజుల పాటు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ సమయంలో 8199 మంది యువత దరఖాస్తు చేసుకున్నారు. మంగళవారం రోజు ఇజ్రాయలుదేరే ముందు యువత హర్యానా ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి నాయబ్ సింగ్ కూడా యువతను అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి మనోహర్ లాల్ కూడా యువతతో మాట్లాడి రాష్ట్రానికి, దేశానికి కీర్తిప్రతిష్టలు తెచ్చేలా యువత కృషి చేయాలని అన్నారు.

ప్రస్తుతం ఇజ్రాయెల్ ,హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, ఇజ్రాయెల్‌లో కార్మికుల కొరత ఏర్పడింది. భారత్ నుండి కార్మికులను పంపాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం కోరింది. ఇజ్రాయెల్ కు ప్రస్తుతం 10,000 మంది నిర్మాణ కార్మికులకు డిమాండ్ ఉంది. వీటిలో ఫ్రేమ్‌వర్క్, షట్టరింగ్, కార్పెంటర్, ప్లాస్టరింగ్, సిరామిక్ టైల్, నూలు పరుపులను పనిచేయటానికి  కార్మికులు కావాలి . ఇక్కడ పనిచేయటానికి వచ్చిన కార్మికులకు నెలకు రూ.1,37,000 జీతం వరకు ఇస్తున్నారు. ఈ ఉద్యోగానికి 10 వ తరగతి అర్హత ,వృత్తిలో మూడేళ్ల పాటు అనుభవం..వయస్సు 25 నుంచి 45 ఏళ్లుగా ఉన్నవారిని ఉద్యోగానికి అర్హులు గా ప్రకటించారు. దీంతో పాటు వైద్య బీమా, ఆహారం, వసతి సౌకర్యాలు కూడా కల్పించనున్నారు. వీరు ప్రతి నెలా రూ.16,515 బోనస్ కూడా పొందుతారు.

#hamas-attack-on-israel #embassy-of-israel #haryana #cm
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe