/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Balapur-Murder.jpg)
Balapur Murder: హైదరాబాద్ బాలాపూర్‌లో దారుణం జరిగింది. అంతా చూస్తుండగానే ఓ యువకుడిని హత్య చేశారు. బాలాపూర్‌లోని రాయల్ కాలనీలో ఘటన జరిగింది. సమీర్ (28) అనే యువకుడిని కత్తితో పొడిచి రాళ్లు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు దుండగులు. సమీర్‌ను ముగ్గురు వ్యక్తులు రౌండప్ చేసి మర్డర్ చేశారు. ఓ వ్యక్తి కత్తితో పొడవగా.. రాళ్లు, కర్రలతో మరో ఇద్దరి దాడి చేశారు. హత్య చేసి ముగ్గురు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. హత్య చేస్తున్న సమయంలో ఓ వ్యక్తి వీడియో తీశాడు. సోషల్ మీడియాలో పెట్టడంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పాతకక్షలే కారణమా, ఆర్థిక వ్యవహారమా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
హైదరాబాద్ నడిబొడ్డున అందరూ చూస్తుండగా కత్తులతో పొడిచి హత్య
బాలాపూర్ పోలీస్ పరిధిలో రాయల్ కాలనీలో సమీర్ (28) అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు కత్తితో పొడిచి, రాళ్ళు, కర్రలతో కొట్టి దారుణంగా హత్య చేశారు. pic.twitter.com/ko57auGtDx
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2024