Minister Seethakka: సొంతూరులో సీతక్కకు ఘన స్వాగతం! మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి సీతక్క ఈ రోజు తన స్వగ్రామం జగ్గన్నపేటకు వెళ్లారు. మంత్రి పదవిని చేపట్టిన తమ ఊరిబిడ్డకు గ్రామస్థులు ఆటపాటలతో ఘన స్వాగతం పాలికారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా సీతక్క అన్నారు. By Jyoshna Sappogula 05 Jan 2024 in Latest News In Telugu తెలంగాణ New Update షేర్ చేయండి Minister Danasari Anasuya Seethakka : మంత్రి హోదాలో తొలిసారి స్వగ్రామం వెళ్లారు పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. ములుగు మండలం లోని జగ్గన్న పేట గ్రామానికి వెళ్లిన ఆమెకు గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. సీతక్కను గ్రామ ప్రజలతో పాటు కాంగ్రెస్ శ్రేణులు శాలువాతో సన్మానించారు. అనంతరం గ్రామస్థులను ఉద్దేశించి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. 'నేను మీ ఆడ బిడ్డను. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన బిడ్డను. నేను పుట్టిన గ్రామం అభివృద్ధి చేసే బాధ్యత నాపైన ఉంది' అని అన్నారు. Also Read: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబుకు షాక్..అప్రూవర్ గా మారిన చంద్రకాంత్.! నమ్మకాన్ని వమ్ము చేయను: సీతక్క ప్రజలు తనపైన పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయనని వ్యాఖ్యనించారు. ములుగు ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తానని భరోసా కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీ లను అమలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజా పాలన లో దరఖాస్తు చేసుకుని వాళ్ళు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అందరికీ సంక్షేమ పథకాలు అందే విధంగా చూస్తానని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కుచన రవళి రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు రేగ కల్యాణి, పార్టీ ముఖ్యనేతలతోపాటు ప్రజా ప్రతినిధులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. సీతక్క అంటే తెలియని వారు ఉండరు. తెలుగు రాజకీయాల్లో సీతక్క ఓ సంచలనంగా అని చెప్పవచ్చు. 15 ఏళ్లకుపైగా మావోయిస్టుగా అజ్ఞాతంలో ఉంటూ పోరాటాలు చేశారు సీతక్క. తర్వాత టీడీపీలో చేరి రాజకీయ ప్రవేశం చేశారు. 2009లో తొలిసారి టీడీపీ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు సీతక్క. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత 2018, 2023 ఎన్నికల్లో వరుస విజయాలు సాధించి సత్తా చాటరు సీతక్క. రేవంత్ రెడ్డికి సన్నిహితురాలిగా పేరు.. రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితురాలిగా సీతక్కకు పేరు ఉంది. రేవంత్ సైతం సీతక్క తన సోదరి అంటూ అనేక సందర్భాల్లో చెప్పారు. ఈ నేపథ్యంలో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తర్వాత రేవంత్ రెడ్డి సీతక్కకు తన మంత్రివర్గంలో చోటు కల్పించారు. అత్యంత కీలకమైన పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు స్త్రీ శిశు సంక్షేమ శాఖను సీతక్కకు అప్పగించారు. #minister-seethakka మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి