తల్లిని కడతేర్చేందుకు కసాయి కూతురు స్కెచ్‌..ఎందుకో తెలుసా..?

బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోనివ్వడంలేదని ఓ కుమార్తె కన్నతల్లికి విషమిచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. తల్లి అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో భయపడిన కుమార్తె స్ధానికులకు అసలు విషయం చెప్పింది. దీంతో వెంటనే ఆ యువతి తల్లిని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.

New Update
తల్లిని కడతేర్చేందుకు కసాయి కూతురు స్కెచ్‌..ఎందుకో తెలుసా..?

Uttar Pradesh: బాయ్ ఫ్రెండ్ ను కలుసుకోనివ్వడంలేదని ఓ కుమార్తె కన్నతల్లిని కడతేర్చేందుకు సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ లోని రాయ్ బరేలీలో దిగ్భ్రాంతికర సంఘటన చోటుచేసుకుంది. బాయ్ ఫ్రెండ్ ను కలిసేందుకు అడ్డుపడుతోందన్న కారణంతో కన్న తల్లిని కడతేర్చేందుకు సిద్ధమైంది. రాయ్ బరేలీలో నివసించే సంగీత యాదవ్ (48) అనే మహిళకు 16 ఏళ్ల కుమార్తె ఉంది. కొంతకాలంగా అమ్మాయి ఓ అబ్బాయితో చనువుగా ఉంటోంది. ఈ విషయం గమనించిన తల్లి సంగీతా యాదవ్.. కుమార్తెను మందలించింది. ఆ అబ్బాయిను కలుసుకోవద్దని ఆంక్షలు విధించింది. దాంతో కుమార్తె తల్లిపై కోపం పెంచుకుంది.

బాయ్ ఫ్రెండ్ కు, తనకు మధ్య తల్లి అడ్డుగా ఉందని భావించింది. తల్లిని ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని  స్కెచ్ వేసింది. తల్లికి విషం ఇచ్చి చంపాలని కుట్ర పన్నింది. అందుకోసం  మార్కెట్ నుంచి విషం తీసుకుని రావాలని తన బాయ్ ఫ్రెండ్ కు చెప్పింది. దీంతో ప్రియురాలి కోసం ఆ యువకుడు విషం తెచ్చాడు. పక్కా ప్లాన్ తో ఉన్న కుమార్తె  తల్లి తాగే టీలో విషం కలిపి ఇచ్చింది. ఆ టీ తాగిన కాసేపటికి తల్లి సంగీతా యాదవ్ అపస్మారక స్థితిలోకి వెళ్లింది. అయితే, ఈ పరిణామంతో భయపడిపోయిన కుమార్తె  వెంటనే పొరుగువారికి అసలు విషయం చెప్పింది. దాంతో వారు వెంటనే సంగీతా యాదవ్ ను ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రాణాలకు ముప్పులేదని డాక్టర్ తెలిపారు.  ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కుమార్తె పై, ఆమెకు సహకరించిన ప్రియుడిపై సెక్షన్ 328 కింద కేసు నమోదు చేశారు. బాలికను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, పరారీలో ఉన్న బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు.

ఈ మధ్య కాలంలో తమ ప్రేమకు అడ్డుగా ఉన్నారని కన్న తల్లిదండ్రులను సైతం లెక్కచేయకుండా కడతేరుస్తున్నారు యువతి యువకులు. సొంత అక్క, తమ్ముడు, చెల్లి అని కూడా లెక్క చేయడం లేదు. ప్రేమ పిచ్చిలో మునుగుతు సొంత వాళ్లను చంపేందుకు  కుట్రలు చేస్తున్నారు. గతంలో కుటుంబం కోసం  ప్రేమను త్యాగం చేసే ఘటనలు చూసాం..కానీ ఇప్పుడు ప్రేమ కోసం కుటుంబ సభ్యులను చంపేందుకు కూడా వెనకడుగు వేయడం లేదు.

Also Read : అఫ్ఘానిస్థాన్‌ను వణికించిన భారీ భూకంపం..!!

Advertisment
తాజా కథనాలు