Bus Fire: 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి బస్‌లో మంటలు.. టైర్ పేలడంతో ప్రమాదం!

నల్గొండ జిల్లా పరిధిలో ప్రైవేట్‌ బస్‌ అగ్నిప్రమాదానికి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్‌ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

New Update
Bus Fire: 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న కావేరి బస్‌లో మంటలు..  టైర్ పేలడంతో ప్రమాదం!

నల్గొండ జిల్లా(nalgonda district) పరిధిలో ప్రైవేట్‌ బస్‌ అగ్నిప్రమాదాని(fire accident)కి గురైంది. మిర్యాలగూడ -హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్‌ తగలబడింది. కావేరి ట్రావెల్స్ బస్‌లో మంటలు చెలరేగాయి. బస్‌ వెనుక టైర్ పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి కావేరి బస్సు నెల్లూరు వెళ్తోంది. ప్రమాద సమయంలో బస్‌లో 26 మంది ప్రయాణికులున్నారు. మంటల ధాటికి బస్సు పూర్తిగా దగ్ధమైంది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

ఈ మధ్య కాలంలో బస్‌ ఫైర్ ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. ఈ ప్రమాదాలు చాలా వరకు రాత్రి లేదా తెల్లవారుజామున ప్రయాణికులు నిద్రిస్తున్న సమయంలోనే జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో ప్రాణనష్టాన్ని తగ్గించడానికి కొన్ని భద్రతా చర్యలు తీసుకోవాలి.

🅐 హెవీ-డ్యూటీ టోర్షన్ బార్‌లు: ఫ్రంట్/రియర్ యాక్సిల్ పూర్తిగా డిస్‌లాడ్జింగ్‌ను నిరోధించడానికి.. బస్సుల ముందు, వెనుక ఇరుసులపై హెవీ-డ్యూటీ టోర్షన్ బార్‌లను అమర్చాలి. దృఢమైన లైవ్/డెడ్ యాక్సిల్‌లు సాధారణంగా టోర్షన్ బార్‌లను కలిగి ఉంటాయి. అయితే హెవీ-డ్యూటీ ఉన్నవి యాక్సిల్ మొత్తం డిస్‌లాడ్జింగ్‌ను నిరోధించగలవు. దృఢమైన లైవ్/డెడ్ యాక్సిల్స్‌పై హెవీ-డ్యూటీ టోర్షన్ బార్‌లు లైఫ్ సేవర్స్ కావచ్చు. ఈ రోజుల్లో చాలా కార్లు ఇండిపెండెంట్ ఫ్రంట్,రియర్ సస్పెన్షన్‌లతో వస్తున్నాయి,.అయితే చాలా హెవీ డ్యూటీ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలు పాతకాలం నాటి దృఢమైన లైవ్/డెడ్ ఫ్రంట్, రియర్ యాక్సిల్‌లను కలిగి ఉన్నాయి.

🅑 డిజీల్ ట్యాంక్‌ లోకేషన్‌ని మార్చాలని నిపుణులు సూచిస్తున్నారు.

🅒 ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ రీడిజైనింగ్, గ్లాస్ బ్రేకింగ్ హామర్స్: కనీసం రెండు లేదా అంతకంటే ఎక్కువ విండో గ్లాసులను పగలగొట్టే సుత్తులు బస్సుల్లో ఉండాలి. బయటికి వెళ్లేందుకు డ్రైవర్ సీటు ఫ్లెక్సిబుల్‌గా ఉండే విధంగా చూడాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్ చుట్టూ ఉన్న సీట్లు/బెర్త్‌లు చురుకైన ప్రయాణీకులకు కేటాయించాలి. ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ కేవలం లెఫ్ట్ సైడే కాకుండా రైట్ సైడ్‌ కూడా ఏర్పాటు చేయాలి.

🅓 బస్సు విండో కర్టెన్లు కాటన్ మాత్రమే ఉండాలి. బస్సులన్నింటికీ కర్టెన్లు తప్పనిసరిగా కాటన్ ఫాబ్రిక్‌తో ఉండాలి. నిజానికి మన బసుల్లో కిటికి క్లాత్‌ మందంగా ఉంటాయి. అగ్ని ప్రమాదానికి గురయ్యే సింథటిక్ పదార్థాలతో తయారు చేసి ఉంటుంది. ఇవి అగ్ని వ్యాప్తిని పెంచుతుంది. ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు కిటికీల దగ్గర ఉండటం వల్ల ఇవి ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి సురక్షితంగా నిష్క్రమించడానికి అడ్డంగా ఉంటాయి.

🅔 బస్సు బైక్‌ సైడ్‌ ఇంజిన్ లొకేషన్ ఉండడం సురక్షితమేనా అంటే కాదనే చెబుతారు నిపుణులు. అనేక కొత్త తరం బస్సుల్లో వెనుకవైపు ఉన్న ఇంజిన్ లొకేషన్ మంటలను ప్రేరేపిస్తోంది.

🅕 బస్సు సిబ్బంది బస్సులో అమర్చిన ప్రయాణికులందరికీ వ్యక్తిగతంగా లేదా వీడియోల ద్వారా అత్యవసర నిబంధనలను గురించి చెప్పాలి. బస్సు లోపల అందుబాటులో ఉన్న భద్రతా చర్యల గురించి ప్రయాణికులకు అవగాహన కల్పించాలి. ఇది తప్పనిసరిగా ఎంబార్కింగ్ పాయింట్/ల వద్ద చేయాలి.

🅖 డ్రైవర్, క్లీనర్‌లు బస్సుకు కెప్టెన్‌లుగా ఉండాలి. బాధ్యతగా వ్యవహారించాలి. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణీకులను సురక్షితంగా మార్గనిర్దేశం చేయాలి. అలాంటి శిక్షణను నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF) ద్వారా అందిస్తే మరింత బెస్ట్‌గా ఉంటుంది. బస్సు డ్రైవర్లు, క్లీనర్లందరికీ ఈ అర్హతలు తప్పనిసరి చేయాలి.

ALSO READ: ఢిల్లీ మెట్రోలో ఘోరంగా కొట్టుకున్న మహిళలు

Advertisment
Advertisment
తాజా కథనాలు