కూతుర్ని ప్రేమించాడని యువకుడిని నగ్నంగా చితకబాది..ఏం చేశాడంటే..?

అనపర్తిలో దారుణం చోటుచేసుకుంది. కూతుర్ని ప్రేమించాడని యువకుడిని నగ్నంగా చితకబాదుతూ..చిత్రహింసలకు గురి చేశాడు ఓ తండ్రి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

New Update
కూతుర్ని ప్రేమించాడని యువకుడిని నగ్నంగా చితకబాది..ఏం చేశాడంటే..?

Anaparthi: కూతుర్ని ప్రేమించాడని ఓ యువకుడిని ఘోరంగా అవమానించాడు ఓ తండ్రి. యువకుడిని నగ్నంగా చితకబాది చిత్రహింసలు పెట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ దారుణమైన ఘటన తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే..?

నెల్లూరు జిల్లాకు చెందిన ఒక యువకుడు.. అనపర్తికి చెందిన ఒక యువతితో ఫేస్ బుక్ లో  పరిచయం చేసుకున్నాడు. వీరిద్దరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. దీంతో, ప్రియురాలి కోసం నెల్లూరు నుంచి వచ్చి అనపర్తిలో రూం తీసుకుని మకాం వేశాడు ఆ యువకుడు. అంతటితో ఆగకుండా,  యువతిని తీసుకుని పరారయ్యేందుకు స్కెచ్ వేశాడు. అయితే, ఇంతలోనే కూతురి ప్రేమ వ్యవహరం తండ్రికి తెలిసింది.

Also Read: విశాఖ హార్బర్ ప్రమాద ఘటనపై డీసీపీ షాకింగ్ కామెంట్స్.!

సినిమా స్టైల్ లో ఆ యువకుడి కోసం కాపు కాసి మరి అతడిని పట్టుకున్నాడు యువతి తండ్రి, మరికొందరు. యువతిని పిలిపించి మరి చిత్రహింసలకు గురిచేశారు. ఆ యువకుడిని ఒంటిపై బట్టలు లేకుండా చేసి దూర్భషలాడుతూ దారుణంగా చితకబాదారు. ప్రియుడిని చావబాదుతుండగా..  క్షమించండి..తప్పయింది అని బ్రతిమాలిన కూడా ఆ యువతి తండ్రి అతడిని ఏ మాత్రం వదలలేదు. కొందరు యువకులు బుతులు తిడుతూ తన్ని తన్ని పెట్టారు.


అదే సమయంలో యువకుడిని కొడుతున్న సంఘటనను సెల్ ఫొన్ లో వీడియో తీశాడు. ఆ వీడియో కాస్తా సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో ఒక్కసారిగా అనపర్తిలో హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయంపై అనపర్తి పోలీసులను వివరణ కోరగా వీడియో ఆధారంగా ఆధారాలు సేకరించి వివరాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఘటన జరిగి వారం రోజులు కావస్తున్న పోలీసులు పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారని స్ధానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఆ యువకుడు భయంతో సొంత గ్రామం నెల్లూరు వెళ్లిపోయినట్లు సమాచారం. యువతి తండ్రి చిర్ల శ్రీనివాసరెడ్డి హోంగార్డుగా రాజమండ్రిలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు