ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌

విశాఖలో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌కి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాడీసన్ హోటల్ సమీపంలో బైక్‌ని కారు ఢీ కొట్టగా అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. మరణించిన ముగ్గురిలో ఇద్దరు భార్యభర్తలు. మరోక వ్యక్తి కారులో ఉన్న మణికుమార్‌గా పోలీసులు గుర్తించారు.

ముగ్గురు ప్రాణాలు బలి తీసుకున్న డ్రంక్ అండ్ డ్రైవ్‌
New Update

మందుబాబుల బుద్ధి మారడం లేదు. అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటున్నమన్న కనీస విచక్షణ ఉండడంలేదు. డబ్బులు ఎక్కువై తాగడం.. కారులో పాటలు పెట్టుకొని ఓవర్‌స్పీడ్‌తో రాత్రుళ్లు డ్రైవ్‌ చేయడం.. గోల చేయడం.. అడ్డొచ్చిన వాళ్లని ఢీకొట్టి చంపేయడం.. ఇదే వీళ్ల నైజం. వరుస ప్రమాదాలు జరుగుతున్నా.. డ్రంక్‌ చేసి డ్రైవ్‌(drunk and drive) చేయవద్దని పోలీసులు నెత్తి నోరు బాదుకున్నా ఏం ప్రయోజనం కనపడని దుస్థితి దాపరించింది. విశాఖ(Vizag)లో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కారణంగా మరోసారి అమాయకుల ప్రాణాలు పోవడం కలిచివేస్తోంది. ఆరిలోవా పోలీస్ స్టేషన్ పరిధిలో ర్యాడీసన్(Radisson) హోటల్ సమీపంలో బైక్‌ని కారు ఢీ కొట్టగా అక్కడిక్కడే ముగ్గురు చనిపోయారు. వీరిలో భార్యాభర్తలు (wife and husband) ఉన్నారు.

వరుస ప్రమాదాలు :
విశాఖలో వారం రోజుల వ్యవధిలో ఈ తరహా ఘటనలు జరగడం ఇది మూడోసారి. ఈ నెల(ఆగస్టు) 2న వీఐపీ రోడ్డులో వాహనాలపైకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ నెల 5న సిరిపురంలో మరోకారు బీభత్సం సృష్టించింది. ఇక తాజాగా నిన్న(ఆగస్టు 7) రాత్రి బీచ్‌రోడ్డులో తప్పతాగి కారు డ్రైవ్ చేయగా.. ముగ్గురి ప్రాణాలు పోయాయి. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలాన్ని పరిశీలించారు సీపీ త్రివిక్రమ్‌ వర్మ. కారులో మద్యం బాటిళ్లు దొరికినట్టు స్పష్టం చేశారు. ఇక విశాఖలో రోజూ 200కు పైగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్ కేసులు నమోదువుతున్నాయి. వరుస ఘటనలు జరుగుతుండడంతో స్పెషల్‌ డ్రైవ్‌లు ముమ్మరం చేస్తామని త్రివిక్రమ్‌ వర్మ చెప్పారు. ఇక ప్రమదానికి అతి వేగమే కారణమని ఏసీపీ మూర్తి తెలిపారు. కారు నడిపిన వ్యక్తిపై కఠిన చర్యలు ఉంటాయని.. కారులో ఎవరెవరు ఉన్నారో గుర్తించే పనిలో ఉన్నామన్నారు. ఇక కారు రిజిస్ట్రేషన్ నంబర్ ప్రకారం సాగర్‌నగర్‌కు చెందిన ఇంటీరియర్‌ డెకరేటర్‌ ఈగల మహేష్‌ సూర్యదిగా పోలీసులు గుర్తించారు.

మృతుల్లో భార్యభర్తలు :
బీచ్‌ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మొత్తం ముగ్గురు ప్రాణాలు విడవగా..అందులో ఇద్దరు భార్యభర్తలు ఉన్నారు. రుషికొండ నుంచి సాగర్‌వైపు వెళ్తున్న వీరి బైక్‌ని కారు అతివేగంతో వచ్చి ఢీకొట్టింది. మృతులు ఒడిశా రాయగడ జిల్లా కృష్ణానగర్‌కి చెందిన సింగారపు పృథ్వీరాజు, ప్రియాంకలుగా తెలుస్తోంది. పృథ్వీరాజు బ్రిడ్జ్‌ అండ్‌ రూఫ్‌ కంపెనీలో సైట్‌ ఇంజనీర్‌గా పని చేస్తున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అటు కారులో ఉన్నవారిలో కూడా ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కారులో ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది. అందులో పీఎం పాలెం ఆర్‌హెచ్‌ కాలనీకి చెందిన మణికుమార్‌ ప్రమాదంలో చనిపోయాడు.

#drunk-and-drive #vizag-road-accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe