Mexico: ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది దుర్మరణం

మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొనటంతో 19మంది దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అధిక వేగం, డ్రైవర్ అలసట కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

New Update
Mexico: ఘోర రోడ్డు ప్రమాదం.. 19 మంది దుర్మరణం

Mexico City: మెక్సికోలోని సినాలోవా రాష్ట్రంలో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ట్రక్కు, డబుల్‌ డెక్కర్‌ బస్సు ఢీకొనటంతో మంటలంటుకొని రెండు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. 19 మంది దుర్మరణం చెందారు. మరో 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

ట్రక్కు ను ఢీ కొట్టిన బస్సు..
ఈ మేరకు పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సినాలోవా రాష్ట్రంలో మంగళవారం ఈ ప్రమాదం జరిగింది. పశ్చిమ రాష్ట్రమైన జాలిస్కోలోని గ్వాడలజారా నగరం నుంచి సినాలోవాలోని లాస్ మోచిస్‌కు ప్రయాణిస్తున్న ప్రయాణీకుల బస్సు ఎలోటా పట్టణంలోని తీరప్రాంత నగరాలైన మజట్లాన్, లాస్ మోచిస్‌ను కలిపే రోడ్డులో ట్రక్కు ను వేగంగా ఢీ కొట్టింది. ఆ సమయంలో బస్సులో 50 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి అదుపులోకి తీసుకొచ్చారు. ఇక అవశేషాలను గుర్తించడానికి సమయం పడుతుందని తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రమాదకరమైన దృష్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా జనాలు ఉలిక్కిపడుతున్నారు.

ఇది కూడా చదవండి : Dindukkal: అమానుషం.. నిండు గర్భిణిని బస్సులో నుంచి తోసేసిన భర్త

అధిక వేగం..
ఇక మెక్సికోలో అధిక వేగం, పేలవమైన వాహన పరిస్థితులు లేదా డ్రైవర్ అలసట కారణంగా ఘోరమైన రోడ్డు ప్రమాదాలు సర్వసాధారణంగా మారిపోయాయని అధికారులు అన్నారు. దేశంలోని హైవేలపై సరుకు రవాణా ట్రక్కుల ప్రమాదాలు కూడా పెరిగాయని, ఇటీవలి సంవత్సరాలలో జరిగిన అత్యంత ఘోరమైన ప్రమాదాలలో ఇదొకటని పేర్కొన్నారు. జులై 2023లో దక్షిణ రాష్ట్రమైన ఓక్సాకాలో పర్వత రహదారిపై ప్రయాణీకుల బస్సు అదుపుతప్పి లోయలోకి పడిపోవడంతో కనీసం 29 మంది మరణించారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు