Success Story: ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే..సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏటా 10 లక్షలు సంపాదిస్తున్న రైతు..!!

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయంపై శ్రద్ధ చూపిస్తున్నారు అన్నదాతలు. సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. నేటి యువత కూడా వ్యవసాయంపై ఆసక్తి కనబరుస్తున్నారు. సాంకేతికతను వినియోగించుకుంటూ వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నారు. ఓ యువకుడు ప్రైవేటు ఉద్యోగం చేస్తూనే సాంద్రియవ్యవసాయం ద్వారా అరటిసాగు చేస్తూ ఏటా పదిలక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు.

New Update
Success Story: ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే..సేంద్రియ వ్యవసాయం ద్వారా ఏటా 10 లక్షలు సంపాదిస్తున్న రైతు..!!

సేంద్రియ వ్యవసాయం ద్వారా రైతులు స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రభుత్వాలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వ్యవసాయానికి కావాల్సిన సహాయ, సహాకారాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నాయి. దీంతో రైతులు, నేటి యువత కూడా వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్నారు. మనదేశంలో సేంద్రియ వ్యవసాయంలో చాలా రాష్ట్రాలు ముందజలో ఉన్నాయి. రైతులందరూ తమ భూమిలో కొంత భాగం సేంద్రియ వ్యవసాయానికి కేటాయించాలని కేంద్రంలోని నరేంద్రమోడీ సర్కార్ సూచించడంతో ఇప్పుడు చాలా మంది రైతులు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. అంతేకాదు సాంకేతికతను వినియోగించుకుంటూ వ్యవసాయంలో లాభాలు గడిస్తున్నారు. ఓ యువకుడు మాత్రం ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే...సేంద్రియ వ్యవసాయం కింద అరటిసాగు చేస్తూ ఏటా లక్షలు సంపాదిస్తున్నాడు.

Organic banana farming

గుజరాత్ లోని సూరత్ జిల్లాల్లో ఉన్న అల్పాడ్ తాలూకా సరస్ గ్రామానికి చెందిన కల్పేష్ అనే 34ఏళ్ల యువరైతు గత నాలుగు సంవత్సరాలు సేంద్రియ వ్యవసాయాన్ని అవలంబిస్తున్నారు. సొంత నైపుణ్యంతో అరటి సాగు చేస్తూ ఏడాదికి 8 నుంచి 10లక్షల వరకు సంపాదిస్తున్నారు.

2018లో సరస్ గ్రామంలో రైతు శిబిరం నిర్వహించారు. ఆ శిబిరంలో రైతులందరినీ సేంద్రియ వ్యవసాయం చేసేలా ప్రోత్సహించారు. అప్పటి నుంచి తాను కూడా సహజ సేంద్రియ వ్యవసాయానికి శ్రీకారం చుట్టానని కల్పేష్ తెలిపారు. మొదట్లో తనకున్న 2 ఎకరాల భూమిలో 35వేల పెట్టుబడితో జీ-9 టీఎస్‌యూ అరటిని సాగుచేశాడు. కేంద్రంలోని మోడీ సర్కార్ యువరైతులను ప్రోత్సహించేందుకు ముద్ర స్కీం ద్వారా రుణాలను అందిస్తోంది. దాని ద్వారా 50శాతం సబ్సిడీ పొందాడు. రసాయనాలు వాడకుండా కేవలం సేంద్రియ ఎరువులను వాడటంతో దిగుబడి పెరిగింది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అరటిపళ్ల నాణ్యత, బరువు కూడా పెరిగింది. రసాయనిక వ్యవసాయం చేసే సమయంలో అరటి గుత్తి 22 నుంచి 25 కిలోల బరువుండేది. కానీ ప్రస్తుతం దాని బరువు 45 నుంచి 50 కిలోలు పెరిగిందని తెలిపారు.

2012లో మా నాన్నకు క్యాన్సర్‌ సోకింది. మా కుటుంబ పెద్దను కోల్పోయాం. అప్పుడే నిర్ణయించుకున్నాం...రసాయనిక వ్యవసాయం మానేసి..సేంద్రియ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాం. చదువు పూర్తయ్యాక ఓ ప్రైవేట్ కంపెనీలో చేరాను. ఉద్యోగం చేస్తూ ఖాళీ సమయంలో సరైన పద్దతిలో సహజ వ్యవసాయం చేస్తున్నట్లు కల్పేష్ చెప్పారు. తాను పండించిన అరటి మార్కెట్లకు విక్రయిస్తున్నట్లు చెప్పారు. తాను చేస్తున్న ఈ పనికి తన భార్యకూడా సహాయసహాకారాలు అందిస్తున్నట్లు తెలిపాడు.

Advertisment
Advertisment
తాజా కథనాలు