దొంగతనానికెళ్లి అడ్డంగా బుక్కైన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్!

కన్నెం వేయడానికి అర్థరాత్రి ఓ కార్పొరేటర్ ఇంటికెళ్ళిన ఓ దొంగ.. దొంగతనం చేసేటప్పుడు ఫాలో కావాల్సిన బేసిక్ రూల్స్ ను మర్చిపోయాడు. చీమ చిటుక్కుమనకుండా దొరికింది మూట కట్టుకొని.. సైలెంట్ గా సైడ్ అయిపోకుండా..బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పై తనకు వీరాభిమానాన్ని అక్కడ ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యాడు.

దొంగతనానికెళ్లి అడ్డంగా బుక్కైన అమితాబ్ బచ్చన్ ఫ్యాన్!
New Update

కన్నెం వేయడానికి అర్థరాత్రి ఓ కార్పొరేటర్ ఇంటికెళ్ళిన ఓ దొంగ.. దొంగతనం చేసేటప్పుడు ఫాలో కావాల్సిన బేసిక్ రూల్స్ ను మర్చిపోయాడు. చీమ చిటుక్కుమనకుండా దొరికింది మూట కట్టుకొని.. సైలెంట్ గా సైడ్ అయిపోకుండా..బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పై తనకు వీరాభిమానాన్ని అక్కడ ప్రదర్శించి అడ్డంగా బుక్కయ్యాడు. సీన్ కట్ చేస్తే కటకటాల వెనుక నిల్చోని ఊచలు లెక్కిస్తున్నాడు ఇప్పుడు.

ఈ ఇంట్రెస్టింగ్ ఘటన ఫుల్ డీటైల్స్ లోకి వెళితే..మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరంలో ఉన్న రిసాల ప్రాంతంలో రెండ్రోజుల క్రితం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ రోజు రాత్రి విజయ్ యాదవ్,సోనూ యాదవ్ అనే దొంగలు ఓ స్థానిక కార్పొరేటర్ ఇంటికి దొంగతనానికి ప్లాన్ చేశారు. ముందుగా వేసుకున్న స్కెచ్ ప్రకారం.. అందరూ పడుకున్న తరువాత ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చారు ఇద్దరు. అందరూ గాఢనిద్రలో ఉండగా.. తాము అనుకున్నట్టుగా బంగారు నగలు, నగదు అంతా మూటకట్టుకున్నారు. ఆ మూటను చంకలో పెట్టుకొని సోనూ అనే దొంగ సైలెంట్ గా గోడ దూకి వెళ్లిపోయాడు.

విజయ్ కి మాత్రం ఆ ఇంట్లో ఉన్న ఓ చక్కటి గోడను చూసి పిచ్చి కోరిక పుట్టింది. అతను బిగ్ బీ కి వీరాభిమాని. అమితాబ్ సినిమాల్లోని డైలాగులు అంటే ఇంకా పిచ్చి. దీంతో ఆ పిచ్చి కాస్త ఆ టైమ్ లో పరాకాష్టకు చేరింది. వచ్చింది దొంగతనం చేయడానికి అన్న మ్యాటర్ కాస్త మర్చిపోయిన దొంగ విజయ్.. అక్కడే ఉన్న స్కెచ్ పెన్నులతో గోడలపై అమితాబ్ డైలాగులు రాయడం మొదలు పెట్టాడు. ఇంతలో ఓ సినిమా సీన్ ను తలపించేలా.. అతడి చెయ్యి తగిలి ఆ పక్కనే ఉన్న అద్దం కింద పడి పగిలింది.

ఇంకేముంది.. ఆ సౌండ్ దెబ్బకు ఇంట్లో ఉన్నవాళ్ళందరూ లేచి.. దొంగను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని దేహశుద్ధి చేశారు. తరువాత పోలీసులకు అప్పగించారు. మరోవైపు నగదు, నగలతో పారిపోయిన రెండో దొంగ సోనూ కోసం పోలీసులు గాలిస్తున్నారు.ఇక పిచ్చి పీక్స్ కు వెళితే.. అనర్థాలు తప్పవనడానికి ఈ ఘటన మంచి ఎగ్జామ్ పుల్.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe