DOG: చేతి బొటన వేలును కరుచుకుని వెళ్లిన కుక్క..!

మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడిపై కుక్క దారుణంగా దాడి చేసింది. చున్నంబట్టివాడకు చెందిన తాళ్లపల్లి ప్రసాద్ తన ఇంటివద్ద ఉండగా వచ్చిన కుక్క బొటన వేలును నోట్లో పెట్టుకుంది. విడిపించుకునేందుకు ఎంత ప్రయత్నించినా వదలలేదు. చివరకు వేలును నోట కరుచుకుని పరుగెత్తింది.

New Update
DOG: చేతి బొటన వేలును కరుచుకుని వెళ్లిన కుక్క..!

Mancherial:  మంచిర్యాల జిల్లాలో ఓ యువకుడిపై కుక్క అతి దారుణంగా దాడి చేసింది. గాయపరచడంతో పాటు యువకుడి ఎడమచేతి బొటన వేలును నోట కరుచుకుని వెళ్లింది. చున్నంబట్టివాడకు చెందిన తాళ్లపల్లి ప్రసాద్ తన ఇంటివద్ద ఉండగా.. అక్కడికి వచ్చిన కుక్క ఆ యువకుడి బొటన వేలును నోట్లో పెట్టుకుంది.

Also Read: నాలుగు రోజులు.. ఏడు రాష్ట్రాలు.. 320 మరణాలు.. ఎండదెబ్బ మామూలుగా లేదుగా.. 

కుక్కను విడిపించుకునేందుకు ప్రసాద్ ఎంత ప్రయత్నించినా వదలలేదు. చివరకు ప్రసాద్ వేలును నోట కరుచుకుని పరుగెత్తింది. వెంబడించిన నలుగురిపై కూడా కుక్క దాడి చేసింది. అప్రమత్తమైన స్థానికులు వైద్యుల ద్వారా బాధితులకు చికిత్స అందించారు.

Advertisment
తాజా కథనాలు