Cruel Man: వీడెంత వెధవ అంటే.. భార్యను చంపి.. సెక్స్ డాల్ కొన్నాడు 

అమెరికాలో ఒక వ్యక్తి తన భార్యను కిరాతకంగా చంపి.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించాడు. తరువాత ఆమె ఇన్సూరెన్స్ డబ్బుతో చేసిన వెధవ పనితో పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. ఆ కిరాతకుడు ఏమి చేశాడో తెలియాలంటే ఈ ఆర్టికల్ చదవాల్సిందే!

Cruel Man: వీడెంత వెధవ అంటే.. భార్యను చంపి.. సెక్స్ డాల్ కొన్నాడు 
New Update

Cruel Man: కొంత మంది ఎంత నీచానికి తెగబడుతున్నారో తెలిస్తే ఒక్కోసారి మనిషిగా ఈకాలంలో పుట్టినందుకు మనమీద మనకే అసహ్యం వేస్తుంది. డబ్బు కోసం అమ్మ.. అక్క.. తండ్రి.. తనయుడు..భార్య..  ప్రియురాలు ఇలా  ఎవరినీ చూడకుండా చంపేస్తున్న సంఘటనలు ప్రతిరోజూ పదుల సంఖ్యలో చూస్తూ వస్తున్నాం. అటువంటి వార్తలు విన్నపుడు అయ్యో అని బాధితులపై జాలిపడటం.. ఆ దారుణానికి ఒడిగట్టిన వాడిపై చికాకు కలగటం చాలా సహజం. అయితే, కొంతమంది సైకో సన్నాసులు(Cruel Man) చేసే పనులు చూస్తే శాంతంగా ఉండే వారికి కూడా ఒక్కసారిగా ఒళ్ళు మండి అటువంటి వారిని చంపేయాలన్నంత కసి కలుగుతుంది. ఇదిగో అంత దుర్మార్గపు పని చేసిన ఒక వెధవ గురించి ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం. 

ఇంచుమించు నాలుగేళ్ల క్రితం అంటే 2019లో అమెరికా- కాన్సాస్‌లోని హేస్‌లో పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్ 911కు ఒక కాల్ వచ్చింది. తన భార్య తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుందని కాల్బీ ట్రికిల్(Cruel Man) అనే వ్యక్తి పోలీసులకు చెప్పాడు. దీంతో పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ దర్యాప్తు చేసిన వారికీ అనుమానాస్పదంగా ఏమీ కనిపించలేదు. దొరికిన ఆధారాలతో ఆమె( క్రిస్టెన్ ట్రికిల్‌)ది ఆత్మహత్యగా నిర్ధారించుకుని కేసు క్లోజ్ చేసేశారు. 

కట్ చేస్తే.. ఈ సంఘటన జరిగిన దాదాపు 21 నెలల తరువాత పోలీసులు  క్రిస్టెన్ ట్రికిల్‌ ని ఆమె భర్త(Cruel Man) చంపినట్టు గుర్తించారు. ఆమెది ఆత్మహత్య కాదనీ.. హత్య అనీ నిర్ధారణకు వచ్చి కాల్బీ ట్రికిల్ ను అరెస్ట్ చేశారు. అసలు ఇలా ఆమెను భర్తే హత్య చేశాడని పోలీసులు ఎలా తెలుసుకున్నారో తెలిస్తే.. వామ్మో అనిపిస్తుంది. అవును.. తన భార్యను దారుణంగా హత్య చేసిన కాల్బీ దానిని పోలీసులతో ఆత్మహత్య అని చెప్పి నమ్మించాడు. ఎటువంటి ఆధారాలు దొరక్కుండా.. అది ఆత్మహత్య అన్నట్టుగా సీన్ క్రియేట్ చేశాడు. దీంతో పోలీసులు ఇది ఆత్మహత్య అని భావించి కేసు క్లోజ్ చేశారు. తరువాత కాల్బీ(Cruel Man) తన భార్య ఇన్సూరెన్స్ డబ్బును పోలీసుల రిపోర్ట్ ఆధారంగా చూపించి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ చేశాడు. 

Also Read: ఈ కారు రూటే సపరేటు.. ప్రయాణంలోనూ ఇంటిలో ఉన్నంత హాయిగా..

ఇన్సూరెన్స్ డబ్బు చేతిలో పడగానే ఈ కిల్లర్(Cruel Man) చేసిన మొదటి పని 2,000 డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 1.70 కోట్ల రూపాయలను ఖర్చు చేసి లైఫ్ సైజ్ సెక్స్ టాయ్‌ను కొన్నాడు. దానితో పాటు కొన్ని వీడియో గేమ్స్ కొన్నాడు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చింది. అతని కదలికలపై నిఘావేశారు. అనుమానాస్పదంగా ఉండడంతో మళ్ళీ విచారణ మొదలు పెట్టారు. దీంతో మనోడు చేసిన నిర్వాకం పోలీసులకు తెలిసింది. తన భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించినట్టు నిర్ధారించారు పోలీసులు. దీంతో ట్రికిల్‌పై ఫస్ట్-డిగ్రీ హత్య మరియు చట్ట అమలులో జోక్యం చేసుకున్నట్లు అభియోగాలు మోపారు. సెప్టెంబరు 2023లో అతని విచారణ సందర్భంగా, ట్రికిల్(Cruel Man) ఒక సెక్స్ డాల్‌ను కొనుగోలు చేసినట్లు న్యాయవాదులు న్యాయనిపుణులకు చెప్పారు. క్రిస్టెన్ ట్రికిల్ మరణించిన నాలుగు సంవత్సరాల తర్వాత, ట్రికిల్ హత్యకు పాల్పడినట్లు తేలింది.

న్యాయవిచారణలో కూడా ట్రికిల్ తన భార్యను క్రూరంగా హత్య చేయడమే కాకుండా.. దానిని ఆత్మహత్యగా చిత్రీకరించి పోలీసులను తప్పుదోవ పట్టించినట్టు తేలింది. దీంతో న్యాయమూర్తి ఈ దుర్మార్గుడి(Cruel Man)కి 50 ఏళ్లపాటు పెరోల్‌కు అవకాశం లేకుండా యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. అదీ విషయం.. చట్టం ఎప్పుడూ తనపని తాను చేసుకుని పోతుంది. ఇలాంటి సైకో దుర్మార్గుల నేరం ఎప్పటికైనా బయటపడి తీరుతుంది అని ఈ కేసు నిరూపిస్తోంది. 

#cruel-man #crime-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe