ఆగస్టు 27న భారత్-శ్రీలంక మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టు మంగళవారం పల్లెకలే స్టేడియంలో శిక్షణ ప్రారంభించింది. కొత్త ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్‌తో పాటు ఇతర కోచ్‌లు శిక్షణను పర్యవేక్షించారు. అయితే శిక్షణ సమయంలో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా, అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది.
శిక్షణ సమయంలో హార్దిక్ కోచ్ గౌతం గంభీర్‌తో చాలాసేపు మాట్లాడాడు. ఆ తర్వాత కొత్త అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ పర్యవేక్షణలో హార్దిక్ బ్యాటింగ్ చేశాడు.ఇద్దరి మధ్య సంభాషణ సమయంలో, హార్దిక్ ఓ షాట్ కొట్టి అది బౌండరీ అని నాయర్ కు చెప్పాడు. అయితే దీనికి అభిషేక్ నాయర్ అంగీకరించలేదు. అక్కడ ఫీల్డర్‌ని ఉంచుతానని చెప్పాడు.ఫీల్డర్ ఖచ్చితమైన స్థానం ఎక్కడ అని హార్దిక్ నాయర్‌ని అడిగాడు. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ దగ్గరలో ఉన్న ఓ రిపోర్టర్‌ను చూపిస్తూ అక్కడని నాయర్ చెప్పాడు.
ఈ యాంగిల్‌లో బంతి వెళ్లింది కాబ్టట్చి అక్కడ ఫీల్డర్ ఉన్నా బౌండరీకి వెళ్లేదని హార్దిక్ అభిషేక్ నాయర్ ను వాదించాడు. దీని పై వివరణ కోసం ఇద్దరూ కలసి ఆ విలేకరి వద్దకు వెళ్లారు. పాండ్యా కొట్టిన ఆ షాట్ బౌండరీకి వెళ్తుందా అని నాయర్ విలేఖరిని ప్రశ్నించాడు. దానికి అతను, 'మీ ఫీల్డర్‌ని ఇక్కడ ఆపేసినా, హార్దిక్ పాండ్యా షాట్ బౌండరీకి పోయేది' అని చెప్పాడు.ఈ సమాధానానికి హార్దిక్, నాయర్ ఇద్దరూ నవ్వుకున్నారు. ఇద్దరి మధ్య జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ ఇప్పుడు ఇంటెర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.