Vishaka: మాంజా దారం తగిలి ఓ చిన్నారికి తీవ్ర గాయం

విశాఖపట్నం RK బీచ్‌లో చిన్నారికి గాలిపటం మాంజా దారం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. చైనా మాంజా దారం గొంతుకు తగిలి గాయపడింది. తీవ్ర రక్తశ్రావంతో ఉన్న చిన్నారిని కేజీహెచ్ కు తరించారు తల్లితండ్రులు. శస్త్ర చికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు.

New Update
Vishaka: మాంజా దారం తగిలి ఓ చిన్నారికి తీవ్ర గాయం

Vishaka: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా పలుచోట్ల విషాద ఘటనలు చోటుచేసుకున్నాయి. పతంగులతో ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ లో పతంగులను ఎగురవేస్తూ భవనంపై కింద పడి ఓ యువకుడు తుదిశ్వాస విడిచారు. అంతేకాకుండా, మాంజాదారం మెడకు చుట్టుకొని తీవ్ర గాయాలతో సైనికుడు ప్రాణాలను విడిచాడు. ఇలా పలుచోట్ల మాంజా దారం తగిలి ప్రాణాలు విడుస్తున్నారు.

Also Read: మాంజా మర్డర్స్.. చైనా దారంతో దారుణాలు.. తప్పెవరిది?

చిన్నారి సేఫ్

తాజాగా, విశాఖపట్నం RK బీచ్‌లో ఓ చిన్నారికి గాలిపటం మాంజా దారం తగిలి తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రితో బీజ్ కు వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. తీవ్ర రక్తశ్రావంతో ఉన్న చిన్నారిని వెంటనే కేజీహెచ్ కు తరించారు బాధిత తల్లితండ్రులు. శస్త్ర చికిత్స చేసి చిన్నారి ప్రాణాలు కాపాడారు. కేజీహెచ్ సూపర్డెంట్ అశోక్ కుమార్ మాట్లాడుతూ..నిన్న బీచ్ లో మాంజా దారం మెడకు తగిలి చికిత్స పొందుతున్న పాపప్రాణాలకు ఎటువంటి ఇబ్బంది లేదని తెలిపారు.

బాధాకరం..

పిల్లల వైద్యులు.. ప్రత్యేక పర్యవేక్షణలో పాపకు వైద్యం చేసి ప్రాణాలను రక్షించారని వెల్లడించారు. మెడకు తక్కువగానే కట్ అవ్వడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని చెప్పారు. హైదరాబాదులో విశాఖకు చెందిన ఆర్మీ ఉద్యోగి ఘటన మరువక ముందే ఇలాంటి సంఘటన చోటు చేసుకోవడం బాధాకరం అని వాపోయారు. ఇలాంటి మాంజా దారాలు ఏవైతే ఉన్నాయో వాటిని బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు.

Also Read: స్కిల్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్‌.. క్వాష్ పిటిషన్‌ సీజేఐకి బదిలీ..

బ్యాన్ చేయాలి

పాప తండ్రి శ్రీనివాస్ మాట్లాడుతూ..నిన్న కంచరపాలెం నుంచి 12:30 ప్రాంతంలో బీచ్ కి వచ్చామని.. అయితే, రెండున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని తెలిపారు. వెంటనే ఆటో సహాయంతో పాపను కేజీహెచ్ కు తరలించినట్లు చెప్పారు. చైనా మాంజా దారాలను బ్యాన్ చేయాలని బాధిత తండ్రి డిమాండ్ చేశాడు. ఇలాంటి వాటి వల్ల అమాయకుల ప్రాణాలు పోతున్నాయని.. పండగ పూట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరం ఆవేదన వ్యక్తం చేశాడు.

Advertisment
తాజా కథనాలు