Crime News: వికారాబాద్‌ జిల్లాలో మహిళ దారుణ హత్య.. పెట్రోల్ పోసి మరి నిప్పంటించిన దుండగులు..!

వికారాబాద్‌ జిల్లాలో మహిళ దారుణ హత్యకు గురైంది. పులమద్ది గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళను దుండగులు చంపేశారు. ఉరి వేసి చంపి అనంతరం పెట్రోల్‌ పోసి మరి దహనం చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

New Update
Crime News: వికారాబాద్‌ జిల్లాలో మహిళ దారుణ హత్య.. పెట్రోల్ పోసి మరి నిప్పంటించిన దుండగులు..!

Crime News: వికారాబాద్‌ జిల్లాలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. పులమద్ది గ్రామ శివారులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైయింది. పొలంలో మహిళను ఉరి వేసి చంపేసిన దుండగులు ..అనంతరం పెట్రోల్‌ పోసి దహనం చేసినట్లుగా తెలుస్తోంది.

Also Read: స్కిల్ స్కామ్ కేసులో ఊహించని ట్విస్ట్‌.. క్వాష్ పిటిషన్‌ సీజేఐకి బదిలీ..

వివరాల్లో వెళ్తే.. పులమద్ది అడవీ ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ మృతి చెందినట్లు గుర్తించారు స్థానికులు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసుపై దర్యాప్తు చేపట్టారు. దుండగులు మహిళను చిరతో ఉరివేసి చంపి.. అనంతరం గుర్తుపట్టని విధంగా పెట్రోల్ పోసి మరి నిప్పంటించారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని క్లూస్ టీమ్ ద్వారా మహిళ వివరాలు సేకరిస్తున్నారు.

Also Read: ప్రాణాలు తీస్తున్న గాలిపటం..ఇప్పటివరకూ ఎంత మంది చనిపోయారంటే..?

మహిళను హత్యకు ముందు అత్యాచారం చేసి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహం గుర్తు పట్టకుండా ఒంటి పై పెట్రోల్ పోసి మరి నిప్పు అంటించడంతో మహిళ ఎవరనేది తేలియని పరిస్థితి కనిపిస్తుందని పోలీసులు చెబుతున్నారు. మహిళ వయస్సు దాదాపు 30 నుండి 35 సంవత్సరాలు ఉంటుందని.. సంఘటన జరిగి రెండు రోజులు  ఉండవచ్చని బావిస్తున్నారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు