కృష్ణా జిల్లాలో జై భీమ్‌ సీన్‌ రిపీట్..ముగ్గురు ఎస్టీ మహిళలపై..

కృష్ణా జిల్లా కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం జరిగింది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచిక దాడికి తెగబడ్డాడు. రెండు రోజులు బందీలుగానే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీశారు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా మోపిదేవి ఎస్ఐ కనీసం తమ గోడు వినడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తీవ్ర గాయాలతో అర్థరాత్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద దయనీయ స్థితిలో ఉన్నారు బాధితులు .

New Update
కృష్ణా జిల్లాలో జై భీమ్‌ సీన్‌ రిపీట్..ముగ్గురు ఎస్టీ మహిళలపై..

A Brutal Attack by an employer on three ST Women: కృష్ణా జిల్లాలో జై భీమ్‌ సీన్‌ రిపీట్ అయింది. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం కే కొత్తపాలెం గ్రామంలో అమానుషం చోటుచేసుకుంది. ముగ్గురు ఎస్టీ మహిళలపై ఓ యజమాని పైశాచికంగా దాడికి తెగబడ్డాడు. రెండు రోజులు బందీలుగానే ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని కాలం వెళ్లదీసారు బాధితులు. తాము తప్పు చేయలేదని పోలీసులకు చెబుదామన్నా మోపిదేవి ఎస్ఐ కనీసం తమ గోడు వినడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటనపై ఎస్టీ సంఘాలు మండిపడుతున్నాయి. ఎన్నీ చట్టాలు తెచ్చిన ఎస్టీలపై ఏ మాత్రం దాడులు ఆగడం లేదంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: వైసీపీ సర్కార్ కు ఇదే ఆఖరి దసరా.. టీటీడీ ఈవో జగన్ ఏజెంట్: బీజేపీ నేత సంచలన వాఖ్యలు

మత్తి రాజా బాబు అనే వ్యక్తి తన ఇంట్లో ఫంక్షన్ ఉండడంతో అదే గ్రామానికి చెందిన దుర్గ అనే ఎస్టీ యానాది కులానికి చెందిన 18 ఏళ్ల యువతిని ఇంట్లో పని చేసేందుకు పిలిపించుకున్నాడు. అయితే, ఇంట్లో దొంగతనం జరిగిందంటూ తప్పుడు నెపంతో ఆ యువతిపై పైశాచికంగా దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ఆ యువతి తలకు తీవ్ర గాయం కావడంతో కేసు నుండి తప్పించుకోవాలని ఆ యజమాని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బలవంతంగా ఆ నేరాన్ని దుర్గ పిన్ని అయిన పద్మ, దుర్గ అమ్మమ్మపై మోపి మరోమారు పోలీసులతో కొట్టించిన వైనం చోటుచేసుకుంది.

అప్పటికే, యజమాని కొట్టిన దెబ్బలతో తీవ్ర గాయాలు ఉన్నప్పట్టికి మోపిదేవి ఎస్సై కనీసం కనికరం చూపించకుండా మరో మారు  గాయపరిచిందంటూ బాధితులు వాపోతున్నారు. ఆస్పత్రికి వెళితే వారి ఇల్లు తగలబెడతామంటూ యజమాని మత్తి రాజబాబు మరింతగా భయపెట్టినట్లు బాధుతులు తెలుపుతున్నారు. కాగా, స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మాల మహానాడు జిల్లా అధ్యక్షులు దోవా గోవర్ధన్ బాధితులను పరామర్శించి జరిగిన అన్యాయాన్ని తెలుసుకుని వారికి వైద్య సాయం ఇప్పించడంతోపాటు నేరం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు