ఏపీలో వింత పంచాయితీ.. ఏపీలో రోడ్డుపైనే గోడ కట్టేసిన ప్రబుద్ధుడు

ఎదురెదురు ఇళ్లలో ఉండే వ్యక్తులు గొడవపడి రోడ్డుమీద గొడ కట్టేసిన వింత ఘటన పల్నాడు జిల్లాలో చోటుచేసుకుంది. లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా మెట్లు కట్టాడనే కోపంతో చంద్రశేఖర్‌ కూడా మెట్లు కట్టేశాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లక్ష్మీ నారాయణ ఏకంగా గోడ కట్టేశాడు.

New Update
ఏపీలో వింత పంచాయితీ.. ఏపీలో రోడ్డుపైనే గోడ కట్టేసిన ప్రబుద్ధుడు

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఓ ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఎదురింటి వాళ్లతో గోడవ పడిన ఓ వ్యక్తి ఏకంగా నడిరోడ్డుపై అడ్డుగా గోడ కట్టేశాడు. గతంలోనూ పలుసార్లు మెట్ల విషయంలో వాళ్లకు గొడవలు జరగగా స్థానికుల సాయంతో పంచాయితీ నిర్వహించారు. అయినా ఏ మాత్రం తగ్గని ఇరువురు మరోసారి తగువులాడుకున్నారు. మాటలతో మొదలైన వాళ్ల ఇష్యూ చివరికి కాలనీ వాసులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేయడంతోపాటు జనాలకు ఆశ్చర్యానికి గురిచేసింది.

Also read :ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సికింద్రాబాద్ నుంచి 22 ప్రత్యేక రైళ్లు

అసలు విషయానికొస్తే.. శావల్యాపురం మండలం కారుమంచికి చెందిన కిలారు లక్ష్మీనారాయణ, కిలారు చంద్రశేఖర్‌కు చెందిన ఇళ్లు ఎదురెదురుగా ఉంటాయి. వీరిళ్ల మధ్యలో సీసీ రోడ్డు ఉంది. అయితే లక్ష్మీనారాయణ రోడ్డు మీదకు వచ్చేలా గతంలో మెట్లు కట్టాడని చంద్రశేఖర్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో ఈ మెట్ల వివాదంపై అప్పట్లోనే గ్రామంలో ఉండే పెద్దలు, పోలీసులు, పంచాయతీ సిబ్బంది ఇద్దరికీ రాజీ కుదిర్చారు. ఈ క్రమంలో చంద్రశేఖర్‌ ఇటీవల తన ఇంటి ఎదుట మురుగు కాలువపై మెట్లు కట్టారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన లక్ష్మీనారాయణ దీనికి నిరసనగా ఏకంగా ఇంటి ముందున్న రోడ్డు మధ్యలో సిమెంటు ఇటుకలతో గోడ నిర్మించారు. దీంతో నడిరోడ్డుపై గోడ కట్టడంతో ఇప్పుడు మరో వివాదం రేగింది.
అందరూ వెళ్లే రోడ్డుపై ఇలా గోడ కట్టడం ఏంటని స్థానికులు మండిపడుతున్నారు. దీనిపై పంచాయతీ అధికారులకు చెప్పినా ఇప్పటివరకూ ఎలాంటి చర్యలూ తీసుకోలేదని గ్రామస్థులు, చంద్రశేఖర్‌ చెబుతున్నారు. అధికారులు వ్యవహారంపై స్పందించాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశమవగా ఇద్దరి మధ్య గొడవలుంటే పంచాయితీ పెట్టి మాట్లాడుకోవాలి కానీ.. ఇలా రోడ్డుపై గోడలు కట్టడం ఏమిటని జనాలు ఆశ్చర్యపోతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు