/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-2024-07-12T154614.006.jpg)
తిరుమలలో యువతిపై చెట్టు కొమ్మ విరిగిపడింది. ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలైయాయి.తిరుమల కొండపై ఉన్న జాపాలి క్షేత్రంలో ఆంజనేయస్వామి దర్శనం కోసం ఓ యువతి వెళ్తుంది. ఈ క్రమంలో ఆమెపై ఒక్కసారిగా చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో ఆమె అక్కడకక్కడే కుప్పకూలిపోయింది. తీవ్రంగా గాయపడిన ఆమెను హుటాహుటిన వైద్యశిబిరానికి తరలించారు. తల, వెన్నెముకకు తీవ్రగాయాలయ్యాయని వైద్యులు తెలిపినట్లు తెలుస్తోంది.ఇక దీనిపై ఇప్పటి వరకు టీటీడీ అధికారులు అధికారిక ప్రకటన చేయలేదు. అసలు గాయపడిన ఆ యువతి ఎవరు..ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2024