Crime News: ట్యూషన్ కి వెళ్లిన బాలుడు..తిరిగి శవమై తేలాడు..అసలేం జరిగిందంటే..!

ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన బాలుడు కుశాగ్ర చివరికి ఓ ఇంట్లో శవమై తేలాడు. ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఆ ఇల్లు ట్యూషన్ టీచర్ బాయ్‌ ఫ్రెండ్‌దని గుర్తించారు. దీంతో అసలు విషయం బయటపడింది. డబ్బుల కోసం కుశాగ్రకు ట్యూషన్ చెబుతున్న మహిళా టీచర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

New Update
Crime News: ట్యూషన్ కి వెళ్లిన బాలుడు..తిరిగి శవమై తేలాడు..అసలేం జరిగిందంటే..!

 A boy was killed by his tuition teacher and her boy friend: ఉత్తర్ ప్రదేశ్ లో దారుణం చోటు చేసుకుంది. కనిపించకుండా పోయిన బాలుడు చివరికి ఓ ఇంట్లో శవమై తేలాడు. తాజాగా వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారుతోంది. ఈ విషయం తెలుసుకుని ఆ బాలుడి తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటనపై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అసలేం జరిగిందంటే?

ఉత్తర్ ప్రదేశ్ కాన్పూర్ లో ఓ ప్రముఖ వ్యాపారవేత్త మనీష్ కనోడియా కుమారుడు కుశాగ్రా (16) స్థానికంగా ఉండే రచిత అనే యువతి వద్ద రోజూ ట్యూషన్ కు వెళ్లేవాడు. ఎప్పటిలాగానే సోమవారం సాయంత్రం కూడా ట్యూషన్‌కు వెళ్లాడు.. తిరిగి వచ్చేటపుడు ఆ కుర్రాడిని ఎవరో కిడ్నాప్ చేశారు. రాత్రి అయిన కుశాగ్ర ఇంటికి రాకపోయే సరికి  కుటుంబ సభ్యులు వెతకడం ప్రారంభించారు. వెంటనే అప్రమత్తమైన ఆ బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, ఈ క్రమంలోనే  కిడ్నాపర్లు బాలుడి తండ్రి మనీష్‌కు ఫోన్ చేసి రూ.30 లక్షలు ఇస్తేనే కుషాగ్రాను వదులుతామని బెదిరించారట. స్ధానికంగా ఉండే గుజన్ టాకీస్ సమీపంలో కుశాగ్రా స్కూటర్, హెల్మెట్ కనిపించాయి.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కుశాగ్రా ట్యూషన్ సెంటర్ సమీపంలోని ఇళ్లలో సోదాలు నిర్వహించారు. చివరకు ఓ ఇంట్లో కుశాగ్రా మృతదేహం కనిపించింది. విచారించగా ఆ ఇల్లు ట్యూషన్ టీచర్ బాయ్‌ఫ్రెండ్‌దని తేలింది. దీంతో అసలు విషయం బయటపడింది. డబ్బుల కోసం కుశాగ్రకు ట్యూషన్ చెబుతున్న మహిళా టీచర్, ఆమె బాయ్‌ఫ్రెండ్ ఈ ఘాతుకానికి పాల్పడ్డారని వెలుగులోకి వచ్చింది. పోలీసులు వారిద్దరి కోసం గాలిస్తున్నారు.

Advertisment
తాజా కథనాలు