CM Jagan: ఏపీలో సంచలనం సృష్టించిన సీఎం జగన్(CM Jagan) పై రాయి దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. జగన్ పై రాయితో దాడి చేసిన యువకుడి ఫొటో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆ యువకుడి పేరు సతీష్ అని తెలుస్తోంది. అయితే, ఇంకా అధికారంగా తెలియాల్సి ఉంది. ఈ కేసులో ఐదుగురు యువకుల బృందాన్ని ప్రత్యేక దర్యాప్తు బృందం(SIT) అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
ప్రాథమికంగా..
జగన్‌పై దాడి కేసులో ఉదయం నుంచి విచారణ కొనసాగుతుంది. విజయవాడ వన్ టౌన్ సీసీఎస్ పోలీస్ స్టేషన్లో నిందితుల్ని విచారిస్తున్నారు. దాడి చేసింది సతీష్ అని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించినట్లు తెలుస్తోంది. అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్‌తోపాటు ఆకాష్, దుర్గారావు, చిన్నా, సంతోష్‌లను సిట్ అదుపులోకి తీసుకుంది.
Also Read: వైసీపీలో వార్.. నాకు ప్రాణహాని ఉందంటున్న కీలక నేత..!
తల్లిదండ్రుల ఆందోళన..
మరోవైపు తమ కుమారులను విచారణకు తీసుకెళ్లడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ పిల్లల్ని ఎందుకు తీసుకెళ్లారో పోలీసులు చెప్పడం లేదంటూ తల్లిదండ్రులు వాపోతున్నారు. దాడి ఘటనలో ఎంతమంది పాల్గొన్నారు..? ఉద్దేశపూర్వకంగా చేశాడా..? లేక ఎవరి ద్వారా అయినా దాడి చేయించారా..? అనే కోణంలో విచారణ కొనసాగుతుంది.
దాడి వెనుక..
దాడి చేయడం వెనుక ఉన్న కారణాలు తెలుసుకునేందుకు పోలీసులు ఆ యువకులను విచారిస్తున్నారు. సీఎం జగన్ బస్సు యాత్ర(Bus Yatra) లో వచ్చినప్పుడు పబ్లిక్‌లో ఉన్న వ్యక్తులు తీసిన వీడియోలను పరిశీలించగా.. నిందితుడిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది.