Delhi AirPort Bomb Threat: విమానంలో బాంబ్.. హైఅలెర్ట్‌లో ఎయిర్‌పోర్ట్

ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానంలో బాంబ్ ఉందంటూ బెదిరింపు కాల్ రావడం కలకలం రేపింది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను ఎమర్జెన్సీ విండో నుంచి కిందికి దింపారు. ఏవియేషన్‌ సెక్యూరిటీ, బాంబ్‌ డిస్పోజబుల్‌ టీమ్‌ విమానంలో తనిఖీలు చేపట్టారు.

New Update
Delhi AirPort Bomb Threat: విమానంలో బాంబ్.. హైఅలెర్ట్‌లో ఎయిర్‌పోర్ట్

Delhi AirPort Bomb Threat:ఢిల్లీ ఎయిర్‌పోర్టులో బాంబు కలకలం రేపింది. ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. ఉదయం 5.35కు విమానంలో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్ వచ్చినట్లు విమాన సిబ్బంది తెలిపారు. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లాల్సి ఉండగా.. బాంబ్ బెదిరింపు కాల్ రావడంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్‌ చేశారు పైలట్‌. ఎమర్జెన్సీ విండో నుంచి ప్రయాణికులను కిందికి దించారు. విమానంలోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు, బాంబ్‌ స్క్వాడ్‌ బృందం ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. ఏవియేషన్‌ సెక్యూరిటీ, బాంబ్‌ డిస్పోజబుల్‌ టీమ్‌ తనిఖీలు చేపడుతోంది. విమానాన్ని ఢిల్లీ ఎయిర్‌పోర్టులోని ఐసోలేషన్‌ బేకు తరలించారు. కాగా గత కొని రోజులుగా దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపు కాల్స్, మెయిల్ వస్తున్నా విషయం తెలిసిందే.

Advertisment
Advertisment
తాజా కథనాలు