Hanmakonda : హనుమకొండలో వెంటాడిన మృత్యువు.. పాపం కుటుంబం

హనుమకొండ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. నీటి గుంతలోపడ్డ బైక్. తల్లి, కొడుకు మృతి. ప్రాణులతో బయటపడ్డ భర్త. అనుమానస్పదంగా జరిగిన సంఘటనపై కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలేం జరిగిందే..?

Hanmakonda : హనుమకొండలో వెంటాడిన మృత్యువు.. పాపం కుటుంబం
New Update

Hanmakonda: వరంగల్ శంభునిపేటకు చెందిన రాజేందర్ సమ్మక్క దంపతుల పెద్దకూతురు రాజేశ్వరిని నర్సక్కపల్లె గ్రామానికి చెందిన తూర్పాటి రమేష్‌కి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ఒక బాబు చోటు ఉండగా రాజేశ్వరి మళ్ళీ 5 నెలల గర్బం దాల్చింది. నిన్నటి రోజున రాజేశ్వరిని కొడుకు చోటును తీసుకొని వైద్య పరీక్షల నిమిత్తం వరంగల్‌కు వెళ్లిన రమేష్ వైద్య పరీక్షల అనంతరం తిరిగి స్వగ్రామం నర్సక్కపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యంలో వెళ్ళంపల్లి శివారులో రోడ్డు మరమ్మతుల కోసం తీసిన భారీ నీటి గుంతలో వారు వెళ్తున్న బైకు అదుపుతప్పి పడిపోయింది. రమేష్ నీటి ప్రవాహంలో ఇదుకుంటూ బయటపడ్డాడు. భార్య రాజేశ్వరి కొడుకు చోటు నీటిలో మునిగిపోయారు.

This browser does not support the video element.

సంఘటనపై సమాచారం తెలుసుకున్న నర్సక్కపల్లి గ్రామస్తులు నీటిలో గల్లంతైన వారికోసం వెతకగా.. రాత్రి చోటు మృతదేహం లభ్యమైయింది. ఈరోజు ఉదయం గాలింపు చర్యలో రాజేశ్వరి మృతదేహం కూడా లభించింది. ఈ సంఘటనలో పలు అనుమానాలు ఉన్నాయి. మృతురాలి తల్లి సమ్మక్క తన కూతురు రాజేశ్వరిని మనవడు చోటును అల్లుడు రమేష్ ఉద్దేశపూర్వకంగానే చంపాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పెళ్లయిన నాటి నుంచి నా బిడ్డను ఇబ్బందులకు గురి చేస్తున్నాడని పలుమార్లు విడాకులు ఇస్తానని బెదిరించేవాడని తల్లిదండ్రులు తెలిపారు. ఎన్నిసార్లు పంచాయతీ నిర్వహించినా తన ప్రవర్తన మార్చుకోలేదని మండిపడ్డారు.

This browser does not support the video element.

తన పంతం నెగ్గించుకొని నా కూతురు మనవడిని హత్య చేశాడని ఆరోపిస్తున్నారు. మృతురాలి తండ్రి రాజేందర్ మాట్లాడుతూ.. నా కూతురును అత్తింటివారే హత్య చేశారని నా బిడ్డను కుటుంబ సభ్యులతో సహా చిత్రహింసలకు గురి చేసేవారని ఆవేధన వ్యక్తం చేశారు. గతంలో గర్భం దాల్చిన గర్భాన్ని తీసేయించాడని నా బిడ్డ అడ్డు తొలగించుకోవడానికి ఈ సంఘటనకు పూనుకున్నాడని తండ్రి రాజేందర్ ఆరోపిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పరకాల పోలీసులు మృతురాలి భర్త రమేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనుకోకుండా జరిగిన ప్రమాదమా..? లేక ఉద్దేశపూర్వకంగా జరిగిందా..? అనే కోణంలో కేసు నమోదు చేసుకొని సంఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నార. మృతదేహాలను పరకాల పోస్టుమార్టంకు తరలించారు.

This browser does not support the video element.

ఇది కూడా చదవండి: అన్న కాదు కాలయముడు…తమ్ముడిని ఏం చేశాడో తెలుసా..?

#hanumakonda-district #death-of-mother-and-son #water-hole #a-bike
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe