కొత్త పార్లమెంట్ భవనం(New Parliament Building) నిర్మాణం మొదలైన దగ్గర నుంచి దాని ప్రారంభోత్సవం జరిగే వరకు కేంద్రం చేసిన హడావుడి అంతాఇంతా కాదు. 'భవనానికి సంబంధించిన రాళ్లు అక్కడ నుంచి తీసుకొచ్చాం.. ఇక్కడ నుంచి మోసుకొచ్చాం.. ప్రపంచంలో మాదే బెస్ట్ పార్లమెంట్' అంటూ డబ్బా కొటుకున్న నేతలు ఇప్పుడేం సమాధానం చెబుతారు. పార్లమెంట్ ఎన్ని వందల కోట్లతో నిర్మిస్తేనేం? సెక్యూరిటీ కదా ముఖ్యం. ఎంపీల భద్రతకే భరోసా లేకపోతే సామాన్యులు మాటేంటి? వాళ్లకి ఏం సమాధానం చెబుతారు.? ప్రజస్వామ్యానికి దేవాలయం లాంటి పార్లమెంట్ హౌస్‌పై దాడి జరగడమంటే యావత్ దేశంపై జరిగినట్టే కదా? సరిగ్గా 22ఏళ్ల క్రితం ఇదే జరిగింది కదా.. మరి ఆ లోపాల నుంచి నేర్చుకున్న పాఠాలేంటి? లోక్‌సభలోకి ఆగంతకులు దూసుకురావడం.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించగా.. షూ లో నుంచి పొగను బయటకు వదలడం క్షణాల వ్యవధిలో జరిగిపోయాయి. ఇలాంటి ఘటనలు సెక్యూరిటీ వైఫల్యాలను కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి. నిందుతులపై.. పట్టుబడ్డ వారిపై బ్లేమ్ గేమ్ ఎలాగో ఉంటుంది కానీ.. సెక్యూరిటీ ఫెయిల్యూర్‌పై ప్రజలు అనేక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు.
ఈ ప్రశ్నలకు బదులేది?
➡ పార్లమెంట్ హౌస్‌లోకి ఆగంతకులు వస్తుంటే సెక్యూరిటీ ఏం చేస్తుంది?
➡ మైసూరు ఎంపీ ప్రతాప్ సింహా గెస్ట్ పాస్‌ను ఆగంతకులు ఎలా తీసుకున్నారు?
➡ పొగ పదార్థాలను పార్లమెంటు లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు?
➡ ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా?
➡ ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడంలో ప్రభుత్వ సామర్థ్యం ఇదేనా?
గ్రెనేడ్లను తీసుకువెళితే?
ఆగంతకులు లోపలికి కలర్ గ్యాస్(Color Gas)లను తీసుకెళ్లారని.. పెద్ద ప్రమాదమేమి కాదని చేతులు దులుపేసుకుంటే సరిపోదు కదా..? ఆ గ్యాస్ ప్లేస్‌లో గ్రెనేడ్లు ఉండి ఉంటే ఏం జరిగేది? వామ్మో తలుచుకుంటేనే భయం పుడుతుంది. ఇండియా వేసే ప్రతి అడుగును.. దేశంలో జరిగే ప్రతి పరిణామాన్ని యావత్ ప్రపంచం ఎంతో నిశీతంగా పరిశీలిస్తున్న వేళ లోక్‌సభలోకి దుండగులు దూసుకురావడంపై కేంద్రం కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుందంటున్నారు విశ్లేషకులు. అందులోనూ కొత్త పార్లమెంట్ భవనంలో ఇలా జరగడం భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తింది. ఈ దాడి మన ప్రజాస్వామ్య సంస్థలను రక్షించడంలో ప్రభుత్వ సామర్థ్యంపైనా తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతుంది. పార్లమెంటు విజిటర్స్‌ని కింద నుంచి మీద వరకు అణువణువు చెక్ చేసి కాని లోపలికి పంపరు. ఇన్నర్‌లో దాచుకుంటారేమోనని తొడల మధ్య తడిమి చూస్తారు కూడా. జేబులో పెన్ ఉన్నా తీసేస్తే గాని లోపలికి పంపరు. అలాంటిది ఇద్దరు స్మోక్ స్టిక్స్ పట్టుకుపోయారు అంటే లోపల వ్యక్తుల నుంచి సపోర్ట్ ఉందానన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. చిన్నచిన్న ఆఫీస్‌ల్లోనే తెలియనివారిని లోపలకి పంపరు... అలాంటిది పార్లమెంట్‌లోకి స్మోక్ స్టిక్స్ ఎలా పట్టుకోచ్చారో?? ఎవరు అనుమతించారో తేలాల్సి ఉంది.
Also Read: అదరలేదు.. బెదరలేదు.. టీయర్ గ్యాస్ విసురుతుంటే రాహుల్ ఏం చేశారంటే?
Parliament Attack: ఆహా.. ఓహో అన్నారు.. ఇదేనా పార్లమెంట్ భద్రత..? ఈ ఐదు ప్రశ్నలకు సమాధానాలేవి?
లోక్‌సభలోకి ఆగంతకులు స్మోక్ స్టిక్స్ తీసుకెళ్లడంతో పార్లమెంట్ భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. పొగ పదార్థాలను పార్లమెంట్ లోపలికి ఎలా తీసుకెళ్లగలిగారు? ఆగంతకులకు లోపల వ్యక్తుల నుంచి మద్దతు ఉందా? లాంటి ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతున్నారు సామాన్యులు.
New Update
Advertisment