Uttar Pradesh: 5 ఏళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడి అత్యాచారం చేశాడు..ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడుకుంటున్న బాలిక అకస్మాత్తుగా అదృశ్యం అయింది.అయితే, బాలిక కోసం కుటుంబసభ్యులు వెతుకుతుండగా దారుణం కంటపడింది. దీంతో,చిన్నారి కుటుంబసభ్యులను చూడగానే నిందితుడు పరార్ అయ్యాడు. ఆనంతరం చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బరేలీ జిల్లాలో దారుణం వెలుగులోకి వచ్చింది. అన్నెంపున్నెం ఎరుగని ఐదేళ్ల బాలికపై 60 ఏళ్ల వృద్ధుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. చివరకు చెట్టుకుని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫరీద్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారి ఎంతసేపటికీ లోపలికి రాకపోవడంతో కుటుంబసభ్యులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ చిన్నారి ఆచూకి కోసం చుట్టుపక్కల అంతా వెతికే క్రమంలో నిందితుడు మహ్మద్ ఇంట్లోకి వెళ్లగా అక్కడ దారుణ దృశ్యం కనిపించింది.
బాలిక కుటుంబసభ్యులను చూడగానే నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. రక్తమోడుతున్న బిడ్డను ఆసుపత్రికి తరలించాక కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడి కోసం గాలిస్తుండగా మహమ్మద్ ఓ చెట్టుకు ఉరివేసుకుని కనిపించారు. పోలీసులకు భయపడో లేక పశ్చాత్తాపం వల్లనో అతడు ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడి మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ మధ్య కాలంలో చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. పిల్లలను స్కూల్ కు పంపాలన్న, టూషన్ కు పంపాలన్న తల్లిదండ్రులు బయపడుతున్న పరిస్ధితి కనిపిస్తోంది. పోక్సో చట్టం లాంటి చట్టాలు ఎన్ని ఉన్న ప్పట్టికీ ఈలాంటి ఘటనలు జరుగుతునే ఉన్నాయి.