Nitin Gadkari: ప్రధాని అవుతారా..అయితే మేం మద్దతిస్తాం!

ప్రధానమంత్రి రేసులో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించారు. ప్రధాని కావడం నా జీవిత లక్ష్యం కాదు.నా విలువలకు, నా సంస్థకు ఎప్పటికీ విధేయుడిని.. అని చెప్పారు.

New Update
gadkari

Nitin Gadkari: ప్రధానమంత్రి రేసులో తాను పాల్గొంటే తనకు మద్దతు ఇస్తానని ఓ రాజకీయ నాయకుడు చెప్పారని, అయితే తనకు అలాంటి ఉద్దేశం లేదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ శనివారం పెద్ద ప్రకటన చేశారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడుతూ..”నాకు ఒక సంఘటన గుర్తుంది.. నేను ఎవరి పేరునూ చెప్పాలనుకోవడం లేదు. 

మీరు ప్రధానమంత్రి అయ్యే ఉద్దేశం ఉంటే కనుక మేము మీకు మద్దతిస్తాం, నిలబడతారా అని ఆ వ్యక్తి అడిగాడు.” అని వ్యాఖ్యానించారు. అయితే.. ఈ సంభాషణ ఎప్పుడు జరిగిందో మాత్రం తెలియజేయలేదు.

నా లక్ష్యం అది కాదు..

నాగ్‌పూర్‌లో జర్నలిస్టుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నితిన్ గడ్కరీ ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ” మీరు ప్రధాని అయితే మీకు మేం మద్దతిస్తాం అని ఓ వ్యక్తి డైరెక్ట్‌ గా నాతో అన్నారు. మీరు నాకు ఎందుకు మద్దతిస్తారని వారిని అడిగాను. నేను మీ నుంచి ఎందుకు మద్దతు తీసుకుంటాను? ప్రధాని కావడం నా జీవిత లక్ష్యం కాదు. నేను నా విలువలకు, నా సంస్థకు నేను ఎప్పటికీ విధేయుడిని… ఏ పదవి కోసం రాజీపడను.

ఈ విలువ భారత ప్రజాస్వామ్యానికి పునాది.” అని మంత్రి తన గత అనుభవాల్ని పంచుకున్నారు. అయితే… 2024, 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రధాని పదవికి నితిన్ గడ్కరీ పేరు తెర మీదకు అయితే వచ్చింది. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు “ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్” సర్వేలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీకి అత్యంత అనుకూలమైన మూడవ నాయకుడిగా గడ్కరీ నే ఉన్నారు.

Also Read: ఘోర పడవ ప్రమాదం..నదిలో మునిగి 64 మంది రైతులు మృతి!

Advertisment
తాజా కథనాలు