9ct Gold: ఇక రూ.25 వేలకే తులం బంగారం.. కేజీల కొద్దీ కొనేయొచ్చు!

బంగారం లో 9 క్యారెట్లకు కూడా హాల్ మార్కింగ్ తప్పనిసరి అని ప్రభుత్వం చెబుతోంది. ఈ నేపథ్యంలో మన దేశంలో 9 క్యారెట్ల బంగారం డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. బంగారంలో రకాలేమిటి? 9 క్యారెట్ల బంగారం మంచిదేనా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు. 

9ct Gold: ఇక రూ.25 వేలకే తులం బంగారం.. కేజీల కొద్దీ కొనేయొచ్చు!
New Update

9ct Gold: బంగారం ఈ పేరు వినగానే అందరి కళ్ళూ మెరుస్తాయి.. ముఖ్యంగా మన దేశంలో మహిళలైతే బంగారం అంటే విపరీతమైన ఇష్టాన్ని చూపిస్తారు. బంగారం ధరలను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటారు చాలామంది. బంగారం కొన్నా.. కొనకపోయినా.. ధర పెరిగింది.. తగ్గింది వంటి టాపిక్స్ నిత్యం ప్రతి ఇంట్లోనూ ఏదో ఒక సమయంలో వస్తూనే ఉంటాయి. అయితే, ఇప్పుడు పెరిగిన బంగారం ధరలను చూస్తే సామాన్యులు బంగారం కొనగలిగే పరిస్థితి కనిపించడం లేదు. రికార్డ్ స్థాయిలో బంగారం ధరలు నమోదు అవుతున్నాయి. మేలిమి బంగారం అంటే 24 క్యారెట్లు.. సాధారణ వ్యక్తులు దీనిని కొనడం చాలా తక్కువగా ఉంటుంది. 22 క్యారెట్లు, 18 క్యారెట్లు బంగారం మన ప్రజలు ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ఇప్పుడు 9 క్యారెట్ల బంగారం కూడా ట్రెండింగ్ లోకి వస్తోంది. 9 క్యారెట్స్ బంగారానికి కూడా భారత ప్రభుత్వం హాల్ మార్క్ తప్పనిసరి చేయాలని  నిర్ణయించింది. దీంతో 9 క్యారెట్ల బంగారానికి కూడా డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తోంది. 

9ct Gold: అసలు ఈ బంగారాన్ని ఇన్ని రకాలుగా ఎందుకు చెబుతారు? వీటిమధ్య తేడా ఏమిటి తెలుసుకుందాం. బంగారం 24 క్యారెట్లు అంటే పూర్తిగా స్వచ్ఛమైనది. 99.99% ప్యూరిటీతో ఉంటుంది. అయితే, ఈ బంగారం ఆభరణాలను చేయడానికి పనికి రాదు. కడ్డీలుగా గానీ, బిస్కెట్లుగా గానీ దీనిని జాగ్రత్త చేసుకోగలం తప్పితే, ఆభరణాలుగా 24 క్యారెట్ల బంగారాన్ని ఉపయోగించలేం. అందుకే ఈ స్వచ్ఛమైన బంగారానికి ఇతర లోహాలను కలుపుతారు. అప్పుడు ఆ బంగారం ఆభరణాలుగా ధరించడానికి పనికి వస్తుంది. ఆభరణాలుగా మనకు అందుబాటులో ఉన్న బంగారం 22 క్యారెట్లు, 18 క్యారెట్లు, 9 క్యారెట్లు గా ఉంది. ముందు వీటి మధ్య వ్యత్యాసాన్ని తెలుసుకుందాం. వీటి మధ్య ప్రాథమిక వ్యత్యాసం విలువైన మెటల్ కంటెంట్. 22 క్యారెట్ల బంగారం 91.6% స్వచ్చతతో ఉంటుంది. అంటే 22 క్యారెట్ల బంగారంతో చేసిన వస్తువులో 91.6% బంగారం ఉంటుంది. మిగిలింది వెండి, రాగి, జింక్, పల్లడియం, ప్లాటినం మిక్స్ ఉంటుంది. ఇక 18 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఇది 75% స్వచ్చతతో ఉంటుంది. అంటే ఇందులో 75% మాత్రమే బంగారం ఉంటుంది. మిగిలింది ఇతర లోహాలతో ఉంటుంది. అలాగే 9 క్యారెట్ల బంగారం విషయానికి వస్తే ఇందులో 37.5% స్వచ్ఛమైన బంగారం ఉంటుంది. ఇంకా ఈ లెక్కను క్యారెట్ల పరంగా చెప్పుకుంటే కనుక.. 24 క్యారెట్లు పూర్తి స్వచ్ఛమైనది. 22 క్యారెట్లు అంటే.. 24/22 అని అర్ధం. అలానే 18 క్యారెట్లు అంటే 24/18 అని, 9 క్యారెట్లు అంటే 24/9 అనీ చెప్పుకోవచ్చు. ఈ బంగారం స్వచ్ఛత అధారంగా బంగారం ధరలు నిర్ణయం అవుతాయి. 

ఏది మంచిది?
9ct Gold: 22,18,9 వీటిలో ఏ క్యారెట్ బంగారం మంచిది అనే ప్రశ్నకు సమాధానం ఏదీ ఉండదు. ఎందుకంటే, వాటిలో ఉండే స్వచ్ఛత ఏమిటో పైన తెలుసుకున్నారు కదా. బంగారం స్వచ్ఛత వరకూ చూసుకుంటే కచ్చితంగా 22 క్యారెట్లు మంచిది అని ఠక్కున చెప్పేయవచ్చు. అయితే, బంగారం ధరలు పెరిగిపోయిన పరిస్థితిలో బంగారం కొనాలి అనుకున్నపుడు లేదా ఒంటి మీద కొంత బంగారం అయినా ఉండాలి అనుకున్నపుడు 9 క్యారెట్స్ కూడా విలువైనదే అని చెప్పవచ్చు. బంగారం స్వచ్ఛత ఆధారంగా ఇది తక్కువ ధరలోనే దొరుకుతుంది. ఉదాహరణకు 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 80 వేల రూపాయలు ఉందనుకుందాం. అప్పుడు 9 క్యారెట్ల బంగారం దాని స్వచ్ఛత ఆధారంగా 24 క్యారెట్ల బంగారం విలువలో 37.5% విలువను లెక్కిస్తారు. అంటే ఇంచుమించుగా.. 9 క్యారెట్ల బంగారం ధర దాదాపుగా 30 వేల రూపాయలుగా ఉంటుంది. పెద్దగా డబ్బు ఖర్చుపెట్టలేని పరిస్థితిలో బంగారం కొనాలి అనుకున్నపుడు 9 క్యారెట్ల బంగారం కొనుక్కోవడం అనుకూలంగా ఉంటుంది. 

హాల్ మార్కింగ్ వ్యవస్థ..
9ct Gold: మార్కెట్లో బంగారం విషయంలో చాలా మోసాలు జరిగే ఛాన్స్ ఉంటుంది. అందుకే, ప్రభుత్వం హాల్ మార్కింగ్ వ్యస్థను తీసుకువచ్చింది. ఇది బంగారం స్వచ్ఛతకు హామీ ఇస్తుంది. ఇప్పటివరకూ 22 క్యారెట్లు, 18 క్యారెట్లు బంగారానికి హాల్ మార్క్ తప్పనిసరి నిబంధన ఉంది. ఇప్పుడు దానిని 9 క్యారెట్లకు కూడా తప్పనిసరి చేశారు. దీనివలన 9 క్యారెట్ల బంగారం తో తయారైన ఆభరణాలకు కూడా స్వచ్ఛతపై గ్యారెంటీ లభిస్తుంది. 

డిమాండ్ పెరుగుతుందా?
9ct Gold: ఇప్పుడు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 9క్యారెట్ల బంగారు ఆభరణాలకు డిమాండ్ పెరుగుతుందని భావిస్తున్నారు. ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఆభరణాల కోసం 9 క్యారెట్ల బంగారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మన దేశంలో సంప్రదాయంగా 22 క్యారెట్ల బంగారాన్ని కోరుకుంటారు. కానీ, బంగారం ధరల పెరుగుదల నేపథ్యంలో ఇప్పుడు స్వచ్ఛతకు కూడా హామీ దొరుకుతున్న పరిస్థితిలో 9 క్యారెట్ల బంగారం కూడా కొనడానికి అందరూ ఇష్టపడతారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బంగారానికి డిమాండ్ పెరగవచ్చని నిపుణులు అనుకుంటున్నారు. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ఇప్పుడు దాదాపుగా 67 వేల రూపాయలుగా ఉంది. అదే 9 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 25 వేల రూపాయల దగ్గరలో ఉంది. అందువల్ల నగలు కొనాలి అనుకున్నపుడు 9 క్యారెట్ల బంగారం కొనుక్కోవడం కూడా మంచిదే. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నపుడు. 

తేడా ఏమిటి?
9ct Gold: ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. నిజానికి బంగారం మెరుస్తుంది అనుకుంటారు. కానీ, దానిలో కలిసిన లోహాన్ని బట్టి బంగారం రంగు మారుతుంది. మెరుపు వస్తుంది. 22 క్యారెట్ల బంగారం కంటే 9 క్యారెట్ల బంగారం మెరుపు ఎక్కువగా ఉంటుంది. మనం ధరించిన నగ ఎన్ని క్యారెట్లు అనేది మనం చెబితేనే కానీ ఎవరికీ తెలియదు. ఈ కారణంగా కూడా 9 క్యారెట్ల బంగారానికి డిమాండ్ పెరగవచ్చు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కొనే బదులు అదే డబ్బుతో 9 క్యారెట్ల బంగారం దాదాపుగా 25 గ్రాముల వరకూ కొనుక్కోవచ్చు కదా. ఇదే ధోరణిలో మన దేశంలో గోల్డ్ లవర్స్ ఆలోచిస్తే.. కచ్చితంగా 9 క్యారెట్ల బంగారం డిమాండ్ భవిష్యత్ లో పెరుగుతుంది.

#9ct-gold #gold
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి