ఈ తాత వికెట్ కీపింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

క్రికెట్ అంటే అభిమానించే వారు ఎవరూ ఉండరు చెప్పండి. మ్యాచులు జరుగుతున్నాయంటే పిల్లలే కాదు పెద్దవాళ్లు సైతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చూస్తుంటారు. ఓ పెద్దాయన 80ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

New Update
ఈ తాత వికెట్ కీపింగ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే..

80 ఏళ్ల వయసులో క్రికెట్.. 

క్రికెట్ అంటే అభిమానించే వారు ఎవరూ ఉండరు చెప్పండి. మ్యాచులు జరుగుతున్నాయంటే పిల్లలే కాదు పెద్దవాళ్లు సైతం ప్రత్యక్షంగానో, పరోక్షంగానో చూస్తుంటారు. ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్ ఉందంటే కాలేజీలు, ఆఫీసులకు సెలవు పెట్టి టీవీలకు అతుక్కుపోతుంటూరు. ఇలాగే ఓ పెద్దాయనకు క్రికెట్ అంటే ఎంత పిచ్చి ఉందంటే ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరీ మ్యాచ్ ఆడాడు. 80ఏళ్ల వయసులో క్రికెట్ ఆడుతున్న ఆయన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్కాట్‌లాండ్ దేశానికి చెందిన మాజీ ఆట‌గాడు అలెక్స్ స్టీల్ వ‌య‌సు 83 సంవ‌త్స‌రాలు.

అనారోగ్యం వెంటాడుతున్నా.. 

2020 సంవత్సరంలో ఆయనకు ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, టెర్మినల్ రెస్పిరేటరీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల‌కు సంబంధించిన వ్యాధి కార‌ణంగా ఆయన శ్వాస తీసుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది. అప్ప‌టి నుంచి ఆక్సిజ‌న్ స‌పోర్టుతోనే జీవిస్తున్నాడు. సాధారణంగా ఇలాంటి వ్యాధి బారిన పడిన వారు ఓ మూలన కూర్చుని బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే మహా అయితే కొద్ది సంవత్సరాలు మాత్రమే బతికే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈయన మాత్రం క్రికెట్ ఆడుతున్నాడు. ఓ వైపు అనారోగ్యం వెంటాడుతున్నా గ్రౌండ్ లోకి దిగి అదరగొట్టాడు.

View this post on Instagram

A post shared by Cricketgraph (@cricketgraph)

ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకుని మరీ..

క్రికెట్ అంటే అమితమైన ప్రేమ ఉన్న అలెక్స్.. త‌న అనారోగ్యాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా వీపుకు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పెట్టుకుని మ‌రీ అత‌డు స్థానిక క్ల‌బ్ క్రికెట్ ఆడాడు. ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లేక‌పోతే జీవించ‌డం క‌ష్ట‌మైనా స‌రే సంతోషంగా వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో వీడియో చూసి అందరూ షాక్ అవుతున్నారు.

621 పరుగులు.. 2 హాఫ్ సెంచరీలు.. 

1967లో లంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ త‌రుపున ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేసిన అలెక్స్ స్టీల్ మొత్తం పద్నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 24.84 సగటుతో 621 పరుగులు చేశాడు. ఐర్లాండ్‌ జట్టుపై రెండు అర్ధ సెంచరీలు చేశాడు. వికెట్ కీపర్‌గా 11 క్యాచ్‌లు ప‌ట్టుకోవ‌డంతో పాటు రెండు స్టంపౌట్‌లు చేశాడు. 83ఏళ్ల వయసులో అది కూడా ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న ఆయన క్రికెట్ ఆడటంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆట పట్ల ఆయనకు ఉన్న ఇష్టం చూసి నెటిజన్లు వావ్.. సెల్యూట్ తాత అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు