Mastan sai: సినీ నటుడు రాజ్ తరుణ్-లావణ్య లవ్ కేసులో అరెస్టైన మస్తాన్ సాయి ఫోన్ లో సంచలన సీక్రెట్స్ బయటపడ్డాయి. మస్తాన్ ఫోన్లో 800కు పైగా అమ్మాయిల న్యూడ్ వీడియోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒక కంపెనీలో టెక్నికల్ టీమ్‌లో మస్తాన్‌సాయి జాబ్ చేస్తూ.. తన ఇంట్లో సీక్రెట్ కెమెరాలు పెట్టుకుని ఈ దారుణానికి పాల్పడ్డట్లు నిర్ధారించారు. తన ఇంటికి వచ్చే అమ్మాయిల వీడియోలు రహస్యంగా చిత్రీకరించి ఆ తర్వాత బ్లాక్మెయిల్ చేస్తూ లొంగదీసుకున్నట్లు తెలిపారు.
బెడ్రూమ్లో సీక్రెట్స్ కెమెరాలు ఫిక్స్ చేసి మస్తాన్ తనపై లైంగిక దాడి చేశాడంటూ లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. వరలక్ష్మి టిఫిన్స్ సెంటర్లో డ్రగ్స్ దందా కేసులో మస్తాన్ ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. అక్కడే లావణ్య, మస్తాన్‌సాయికి మధ్య పరిచయం ఏర్పడినట్లు తెలిపారు.