/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rama-1-jpg.webp)
అయోధ్య (Ayodya) రామమందిరం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుంది. వచ్చే ఏడాది సంక్రాంతికి(Sankranthi) ఆలయాన్ని ప్రారంభించాలని కేంద్రం గట్టిగా సంకల్పించింది. ఇప్పటికే మందిరం నిర్మాణం జరుగుతున్న పనులు చిత్రాలు కూడా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలోనే రామాలయ గర్భగుడిలో పాలరాతితో చేసి..బంగారు (Gold)పూత పూయించిన 8 అడుగుల ఎత్తున్న సింహాసనాన్ని తయారు చేయనున్నట్లు సమాచారం.
अयोध्या स्थित श्री राम जन्मभूमि पर हो रहे मंदिर निर्माण कार्य के आज प्रातः लिए गए कुछ चित्र
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) October 16, 2023
Some pictures clicked at Shri Ram Janmabhoomi Mandir construction site this morning. pic.twitter.com/4eJe9dNljE
ఈ పీఠం పై రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. దీనిని రాజస్థాన్ హస్తకళాకారులు తయారు చేస్తున్నారని ఆలయ ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా వెల్లడించారు. సింహాసనం ఎనిమిది అడుగుల ఎత్తు, నాలుగు అడుగుల వెడల్పు ఉంటుందని ఆయన వివరించారు.డిసెంబర్ 15 నాటికి ఈ సింహాసనం అయోధ్యకు చేరుకుంటుందని పేర్కొన్నారు.
Also read: హ్యాపీ బర్త్‌డే..! కంగారులను కంగారు పెట్టించిన లక్ష్మణుడు..!
గర్భగుడి నిర్మాణం కూడా 98 శాతం పూర్తయినట్లు మిశ్రా చెప్పారు. వచ్చే నెల 15 నాటికి రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ ను కూడా ముందుగానే రెడీ చేయాల్సి ఉందని ఆయన వివరించారు. మొదటి అంతస్తులో 80 శాతం మేర పనులు పూర్తయ్యాయి.
ఇందులో ముందుగా 17 స్తంభాలు ఏర్పాటు చేయగా..మరో రెండింటి పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని తెలిపారు.మొదటి అంతస్తు పైకప్పు నిర్మాణం కూడా డిసెంబర్ 15 కి అంతా పూర్తవుతుందనుకుంటున్నామని మిశ్రా వివరించారు. పరిక్రమ మార్గ్ లోని ఫ్లోరింగ్ పనులు కూడా పూర్తయ్యాయని ..ప్రస్తుతం మార్బుల్స్ వేసే పనులు జరుగుతున్నాయని మిశ్రా తెలిపారు.
భక్తులు రాముడి కోసం పెద్ద మొత్తంలో బంగారం, వెండి వస్తువులను విరాళంగా ఇచ్చారు. వాటిని భద్రంగా ఉంచడం కష్టంగా ఉంది.అందుకే వాటిని పేరున్న నగల సంస్థ ఆధ్వర్యంలో కరిగిస్తామని ఆయన వివరించారు.
Follow Us