/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/break.png)
హైదరాబాద్ లోని ఓ బ్యాంకులో రూ. 8కోట్లను ఫ్రీజ్ చేశారు సైఫాబాద్ పోలీసులు. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాల మేరకు ఈ డబ్బును ఫ్రీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. విశాఖ ఇండస్ట్రీస్ నుంచి విజిలెన్స్ సెక్యూరిటీస్ అనే సంస్థకు ఈ డబ్బు బదిలీ అయినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నెల 13వ తేదీని విశాఖ ఇండస్ట్రీస్ కు చెందిన ఓ అకౌంట్ నుంచి బదిలీ అయినట్లు పోలీసులు నిర్దారించారు. దీంతో ఐటీ, ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులకు సమాచారం అందించారు. కాగా విశాఖ ఇండస్ట్రీ కాంగ్రెస్ అభ్యర్థ వివేక్ కు సంబంధించినదని చెబుతున్నారు. ఆయన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ నగదు బదిలీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.