/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/alcohol-jpg.webp)
ఓపెన్ యాక్సెస్ జర్నల్ బీఎంజే ఆంకాలజీలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం, గత మూడు దశాబ్దాల్లో (1990-2019) ప్రపంచవ్యాప్తంగా 50ఏళ్ల లోపు వారిలో క్యాన్సర్ కేసుల సంఖ్య 79శాతం పెరిగాయి. 2019లో ఈ వయస్సులోపు వారిలో రొమ్ము క్యాన్సర్ అత్యధిక సంఖ్యలో 'ఎర్లీ ఆన్‌సెట్' కేసులకు కారణమైంది. అయితే 1990 నుంచి విండ్‌పైప్ (నాసోఫారెక్స్), ప్రోస్టేట్ క్యాన్సర్‌లు అత్యంత వేగంగా పెరిగాయని పరిశోధనలు చెబుతున్నాయి. 2019లో యువకులలో అత్యధిక మరణాల సంఖ్యను, ఆరోగ్యాన్ని దెబ్బతీసే క్యాన్సర్‌లు రొమ్ము, శ్వాసనాళం, ఊపిరితిత్తులు, ప్రేగులు, కడుపుకు సంబంధించినవి.
50లోపు వారిలోనే పెరుగుతున్నాయి:
వృద్ధులలో క్యాన్సర్ చాలా సాధారణం అయినప్పటికీ, 1990ల నుంచి ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో 50 ఏళ్లలోపు వారిలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలగిస్తోంది. 204 దేశాల్లో గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ 2019 అధ్యయనం నుంచి డేటాను తీసుకున్నారు. 1990-2019 మధ్య మార్పును అంచనా వేశారు. కొత్త కేసులు, మరణాలు, ఆరోగ్య పరిణామాలను కన్సిడర్ చేశారు. 14-49 సంవత్సరాల వయస్సు ఉన్న వారిలో క్యాన్సర్ కేసులు ఎక్కువగా గుర్తించారు.
లైఫ్ స్టైల్ కారణంగానే:
ధూమపానం, వాపింగ్, మద్యపానం, జంక్, ప్రాసెస్ చేసిన ఆహారాలు కారణంగా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయని డాక్టర్లు చెబుతున్నారు. తక్కువ శారీరక శ్రమ మరోక కారణంగా తెలుస్తోంది. ధూమపానం తర్వాత, అధిక బరువు క్యాన్సర్‌కు రెండవ అతిపెద్ద కారణం. ఇది ప్రేగు , మూత్రపిండాలు , గర్భం, గుల్లెట్ (అన్నవాహిక) క్యాన్సర్‌లతో సహా అనేక రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని పెంచుతుంది . అధిక బరువు మెనోపాజ్ ఉన్న స్త్రీలు కూడా రొమ్ము క్యాన్సర్ ప్రమాదాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు . ఆరోగ్యకరమైన బరువు క్యాన్సర్, గుండె జబ్బులు, మధుమేహం లాంటి ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. పండ్లు, కూరగాయలు, తక్కువ కొవ్వు, తక్కువ చక్కెరతో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. మీరు ఎంత యాక్టివ్‌గా ఉన్నారనే దాన్ని బట్టి మీకు అవసరమైనంత ఆహారం మాత్రమే తినండి. శారీరకంగా మరింత చురుకుగా ఉండండి. మీరు మీ బరువు గురించి ఆందోళన చెందుతుంటే లేదా మరింత సమాచారం కావాలంటే, మీ డైటీషియన్‌తో మాట్లాడండి.
ఇక రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. శారీరక శ్రమ మీ సాధారణ ఆరోగ్యం, శ్రేయస్సుకు కూడా మంచిది. ప్రతి వారం కనీసం 150 నిమిషాల ఎక్సర్‌సైజ్ చేయండి. ఈ టైమ్‌ని పెంచుతూ వెళ్లండి. బయట కొంత సమయం గడపడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. విటమిన్ డి తయారు చేయడానికి మన శరీరాలకు సూర్యరశ్మి అవసరం. ఇది ఎముకల ఆరోగ్యానికి ముఖ్యమైనది.. కొన్ని అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
ALSO READ: మంచినీళ్లు అతిగా తాగితే ఏం అవుతుందో తెలుసా?
ALSO READ: విద్యార్థులు శ్రీకృష్ణుడి దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలివే!