Sheep Distribution scheme: గొర్రెల పంపిణీ స్కాం @700 కోట్లు

గత ప్రభుత్వం యాదవ సోదరుల కోసం తెచ్చిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ వెల్లడించింది. ఈ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అదుపులోకి తీసుకుంది ఏసీబీ.

New Update
Sheep Distribution scheme: గొర్రెల పంపిణీ స్కాం  @700 కోట్లు

Telangana Sheep Distribution scheme: గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ పథకంలో అవకతవకలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గొర్రెల పంపిణీలో గోల్‌మాల్‌ జరిగినట్లు పేర్కొన్నారు. ఈ పథకంలో రూ.700 కోట్ల అవినీతి జరిగినట్లు ఏసీబీ తేల్చింది. మాజీ మంత్రి తలసాని ఓఎస్డీ కల్యాణ్‌తో పాటు పశుసంవర్ధక శాఖ సీఈవో రాంచందర్‌ అరెస్ట్‌ చేసింది. ఇప్పటికే ఈ కేసులో 10 మందిని అదుపులోకి తీసుకొని విచారణలో కీలక విషయాలను బయటకు తెస్తోంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహిదొద్దీన్ పరారీలో ఉన్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. అతని కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. గొర్రెల స్కీమ్‌ను కాంట్రాక్టర్లకు రామచందర్ అప్పజెప్పినట్లు తెలిపారు. లోలోన కంపెనీతోపాటు మరికొంతమంది కాంట్రాక్టర్లను ఏసీబీ గుర్తించింది. గొర్రెల పంపిణీ పథకానికి గత ప్రభుత్వం హయాంలో రూ.6 వేల కోట్ల నిధులు విడుదల చేసింది. కాంట్రాక్టర్లు, అధికారులే ఎక్కువగా లబ్ధి పొందినట్టు ఏసీబీ వెల్లడించింది. మొత్తం వ్యవహారంలో రాజకీయ ప్రమేయంపైనా దర్యాప్తు చేస్తున్నారు. గొర్రెల స్కాం వెనుకాల ఉన్న వారి పాత్ర బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు