కేదార్‌నాథ్ యాత్రలో గుండెపోటు మరణాలే ఎక్కువ..ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే..!!

కేదార్‌నాథ్ తలుపులు తెరిచినప్పటి నుండి ఇప్పటివరకు 68 మంది యాత్రికులు ధామ్‌లో మరణించారు. గుండెపోటు వల్లే మరణాలు ఎక్కువగా సంభవించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ప్రయాణికులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించింది. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్‌లో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు గత రెండు నెలల్లో 68 మంది యాత్రికులు మరణించారు.

author-image
By Bhoomi
New Update
కేదార్‌నాథ్ యాత్రలో గుండెపోటు మరణాలే ఎక్కువ..ఇప్పటివరకు ఎంతమంది మరణించారంటే..!!

ఈఏడాది ఏప్రిల్ 25నుంచి కేదార్ నాథ్ యాత్ర ప్రారంభమైంది. కేదార్ నాథ్ ను దర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తుంటారు. అయితే కేదార్ నాథ్ లో వాతావరణం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు. వాతావరణం తట్టుకోలేక చాలా మంది భక్తులు మరణించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ ఏడాది కేదార్ నాథ్ తలపులు తెరిచినప్పటి నుంచి ఇప్పటి వరకు 68మంది యాత్రికులు మరణించినట్లు అధికారులు తెలిపారు. గుండెపోటు వల్ల మరణించినవారే ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. మరోవైపు ఆరోగ్యశాఖ ఇప్పటి వరకు మూడు వేల మందికి పైగా ప్రయాణికులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించింది. ఏప్రిల్ 25న కేదార్‌నాథ్‌లో యాత్ర ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు గత రెండు నెలల్లో 68 మంది యాత్రికులు మరణించారు.

publive-image

గతేడాదితో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినప్పటికీ గతేడాది ఎక్కువ మంది గుండెపోటుతో మరణించారు. కేదార్‌నాథ్ యాత్ర ప్రధాన స్టాప్‌తో పాటు, నడక మార్గంలో యాత్రికుల ఆరోగ్య పరీక్షలు నిరంతరం జరుగుతున్నాయి. సోన్‌ప్రయాగ్‌లో, ఆరోగ్య శాఖలోని వైద్యులు, పారామెడికల్ సిబ్బంది సంబంధిత ప్రయాణీకుల షుగర్, బీపీ, ఆక్సిజన్ స్థాయిలను చెక్ చేస్తున్నారు. కేదార్‌నాథ్‌ ధామ్‌ సందర్శనకు వచ్చే భక్తులకు అనారోగ్య సమస్యలు తలెత్తితే ఆరోగ్యశాఖ వెంటనే ఆరోగ్య పరీక్షలు నిర్వహించి చికిత్స అందిస్తున్నదని చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ హెచ్‌సీఎస్‌ మర్టోలియా తెలిపారు. ఆదివారం 1891 మంది భక్తులకు ఎమర్జెన్సీ, ఓపీడీతో పాటు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు చేసినట్లు వెల్లడించారు.

ఇప్పటి వరకు 106356 మంది OPD, అత్యవసర సౌకర్యాలు, 92562 మంది యాత్రికులు OPD ద్వారా మాత్రమే చికిత్స పొందినట్లు తెలిపారు. ఇందులో 73182 మంది పురుషులు, 9380 మంది మహిళలు ఉన్నారు. ఇప్పటి వరకు మొత్తం 3034 మంది ప్రయాణికులకు ఆక్సిజన్ సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు