భర్తకు 62.. భార్యకు 30.. ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు! By Shareef Pasha 14 Jun 2023 in నేషనల్ ట్రెండింగ్ New Update షేర్ చేయండి మధ్యప్రదేశ్‌లోని సత్నా జిల్లాలో నివాసం ఉంటున్న ఓ వృద్ధుడు తన 62 ఏళ్ల వయసులో ముగ్గురు పిల్లలకు తండ్రయ్యాడు. ఈ అరుదైన వింత సంఘటన మధ్యప్రదేశ్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 62 ఏళ్ల ఓ వృద్ధ భర్త, 30 భార్య ఇద్దరూ కలిసి మంగళవారం ఉదయం ముగ్గురు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు.ఇక అసలు వివరాల్లోకి వెళితే... సత్నా జిల్లాలోని ఉచెహ్రా మండలం అతర్వేదియా ఖుర్ద్ గ్రామానికి చెందిన గోవింద్ కుష్వాహా (62), హీరాభాయ్ కుష్వాహా (30) దంపతులు. సోమవారం రాత్రి గోవింద్ భార్య హీరాభాయికి పురిటినొప్పులు రావడం వల్ల ఆమెను సమీపంలోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. పలు పరిక్షల అనంతరం వైద్యులు మంగళవారం ఉదయం హీరాభాయ్‌కి ఆపరేషన్ చేశారు. ఈ కాన్పులో ఆమె ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. అతర్వేదియా గ్రామానికి చెందిన హీరాబాయి కుష్వాహాకు మామూలుగా సాధారణ ప్రసవం 35 వారాలకు పూర్తవుతుంది. కానీ, ఈమె ఎనిమిదిన్నర నెలలకే ప్రసవించడం కారణంగా పిల్లలు బలహీనంగా పుట్టారు. ప్రస్తుతం వీరి పరిస్ధితి విషమంగా ఉండటంతో శిశువులను ఐసీయూలో ఉంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నేను రెండు పెళ్లిళ్లు చేసుకున్నాను. మొదటి భార్య పేరు కస్తూరిభాయి. ఆమె వయస్సు 60 సంవత్సరాలు. మాకు ఓ కుమారుడు జన్మించాడు. అతడు 18 ఏళ్ల వయస్సులోనే ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అందుకే పిల్లల కోసం మళ్లీ పెళ్లీ చేసుకున్నానని తెలిపాడు.అయితే తన కుమారుడు మరణించడం వల్ల తన మొదటి భార్య దగ్గరుండి తనకు రెండో వివాహం జరిపించిందని గోవింద్ కుష్వాహా (62) తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి