JOBS: యూనియన్ బ్యాంక్ లో 606 ఉద్యోగాలు.. దరఖాస్తు చివరితేదీ ఇదే

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఫ్రిబవరి 23 వరకూ అప్లికేషన్ తుది గడువు. ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

New Update
JOBS: యూనియన్ బ్యాంక్ లో 606 ఉద్యోగాలు.. దరఖాస్తు చివరితేదీ ఇదే

Union Bank of India Recruitment 2024: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిరుద్యోగులకు తీపి కబురు అందించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 606 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లను భర్తీ చేయనుండగా అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఈ మేరకు ఇప్పటికే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించగా.. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.unionbankofindia.co.in ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలని సూచించింది.

దరఖాస్తు:
ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 23 చివరితేదీ.

దరఖాస్తు ఫీజు:
అభ్యర్థుల్లో ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు దరఖాస్తు ఫీజు రూ. 175 కాగా, జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.850గా నిర్ణయించారు.

ఎంపిక విధానం:
ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్ట్ లకు అభ్యర్థులను ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, వ్యక్తిగత ఇంటర్వ్యూ ల ద్వారా ఎంపిక చేస్తారు.

ఇది కూడా చదవండి: Operation Smile: సంగారెడ్డిలో 66 మంది బాల కార్మికులకు విముక్తి

అప్లై ఎలా చేయాలి:
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ముందుగా.. యూనియన్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ www.unionbankofindia.co.in ను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో కనిపించే రిక్రూట్మెంట్ ట్యాబ్ పై క్లిక్ చేయండి. "యూనియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ ప్రాజెక్ట్ 2024-25 (స్పెషలిస్ట్ ఆఫీసర్స్)" కోసం అప్లై లింక్ పై క్లిక్ చేయాలి. కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది. అందులోని అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి. అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాల్సివుంటుంది. ఇందులోనే అప్లికేషన్ ఫీజు చెల్లిచాలి.

పూర్తి వివరాలకు:
వెబ్ సైట్ ను సంప్రదించండి. www.unionbankofindia.co.in 

Advertisment
Advertisment
తాజా కథనాలు