Kashi Vishwanath : కాశీ విశ్వనాథుని ఈ 6 రహస్యాలు వింటే మీరు మైమరచిపోవడం ఖాయం..!

కాశీలాంటి మోక్షదాయక క్షేత్రం మరొక్కటి లేదంటారు. అన్నపూర్ణాసమేత విశ్వేశ్వరుడు కొలువుదీరిన ఈ క్షేత్రంలో అడుగు పెట్టడమే ఎన్నో జన్మల పుణ్యఫలంగా భావిస్తుంటారు. కాశీ విశ్వనాథ ఆలయానికి సంబంధించిన రహస్యాలు మీకు తెలుసా? కాశీ విశ్వనాథుని ఈ రహస్యాలు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు.

New Update
Kashi Vishwanath : కాశీ విశ్వనాథుని ఈ 6 రహస్యాలు వింటే మీరు మైమరచిపోవడం ఖాయం..!

Kashi Vishwanath : ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాలలో కాశీ విశ్వనాథుని ఆలయం ఒకటి. పురాతన చరిత్ర ఉన్న ఈ ఆలయం.. వారణాసి (Varanasi) నగరంలో గంగా నది ఒడ్డున ఉంది. కాశీ విశ్వనాథ ఆలయాన్ని విశ్వేశ్వర్ అని కూడా అంటారు. శివునికి అంకితం చేసిన ఈ ప్రసిద్ధ ఆలయం అనేక రహస్యాలను కలిగి ఉంది. అలాంటి పుణ్యక్షేత్రం కాశీకి వెళ్లాలని తపించి, వెళ్లాక, ఆధ్యాత్మిక భావాలలో మునిగిపోయేవారికి అన్నిచోట్లా విశ్వేశ్వరుడు, విశాలక్షే దర్శనమిస్తారు. నిండుమనసుతో ఒక్కసారి పావనమైన ఆ కాశీ పట్టణాన్ని, విశ్వేశ్వరుని, గంగమ్మతల్లిని, చల్లని తల్లులు విశాలాక్షి, అన్నపూర్ణలను తలుచుకుంటే...మీన మనస్సు భక్తి భావంతో నిండిపోతుంది. మనసునిండా ఉన్న ఆ భక్తి భావంతో కాశీని ఒక్కసారైనా చూడండి. పురాణ ప్రాశస్త్యం పొందిన ఆ కాశీ నగరం కళ్లముందు కనిపిస్తుంది. సాక్షాత్తూ ఈ పరమశివుడు కొలువుదీరిన ఈ ప్రసిద్ధ ఆలయం అనేక రహస్యాలను కలిగి ఉంది. ఆ రహస్యాలు ఏమిటోఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

పాపాలకు పరిహారం:
కాశీ విశ్వనాథ్ ఆలయం పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటి. హిందూ మతంలో గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఈ అద్భుతమైన హిందూ దేవాలయం, కాశీ విశ్వనాథ్, వేల సంవత్సరాలుగా ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఉంది.ఈ ఆలయం శివుడికి అంకితం. తెలిసి తెలియక చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం పొంది పాపాలను పోగొట్టుకోవడానికి కాశీ విశ్వనాథుని దగ్గర ఉన్న గంగానది పవిత్ర జలాల్లో స్నానం చేస్తే.. ఎంతో మేలు చేస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

publive-image

గొప్ప వ్యక్తులు సందర్శించిన ప్రదేశం:
ఆదిశంకరాచార్య, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, మహర్షి దయానంద, గోస్వామి తులసీదాసు వంటి గొప్పవ్యక్తులు ఈ అద్భుతమైన ఆలయాన్ని సందర్శించారని పురాణాలు చెబుతున్నాయి. ఆ సమయంలో కాశీ విశ్వనాథుని సన్నిధిలో ఉన్న స్థానిక ప్రధాన పూజారి వారికి ఘనస్వాగతం పలికారు. కాశీ విశ్వనాథుడు అన్ని ప్రాపంచిక సుఖాల నుండి మోక్షాన్ని, విముక్తిని ప్రసాదిస్తాడని వారి విశ్వాసం. అందుకే కాశీ విశ్వనాథుని సన్నిధిని దర్శించుకునేవాళ్లు.

publive-image

భాగవతం అధ్యయనం:
ప్రముఖ సన్యాసి ఏకనాథుడు తన వరాకారి సమాజానికి చెందిన శ్రీ ఏకనాథ భాగవతాన్ని ఈ కాశీ విశ్వేశ్వనాథ దేవాలయంలోని నిర్మలమైన ప్రాంగణంలో చాలా సంవత్సరాలు కూర్చోని పూర్తి చేశాడు.

publive-image

మహాశివరాత్రికి శోభాయాత్ర:
మహాశివరాత్రి సందర్భంగా కాశీ నగరంలోని ఇతర ముఖ్యమైన దేవాలయాల నుండి శోభాయాత్రను నిర్వహిస్తారు. డప్పుచప్పులు, వాయిద్యాలతో అందంగా అలంకరించిన రథం కాశీ విశ్వనాథుని ఆలయం వైపు పవిత్ర ఊరేగింపు నిర్వహిస్తారు. ఈ ఊరేగింపులో దేశ విదేశాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. హరహరమహదేవ్ శంభో శంకర అంటూ భక్తులు శోభాయాత్రతోపాటు ముందుకు సాగుతుంటారు.

Kashi Vishwanath

విశ్వనాథ్ అనే పదానికి అర్థం:
కాశీ విశ్వనాథ దేవాలయం లోపలి గర్భగుడిలో ప్రతిష్టించబడిన శివుని ప్రధాన విగ్రహానికి పెట్టిన పేరు- విశ్వనాథ్ అంటే విశ్వానికి పాలకుడు. మీరు జీవితంలో ఒక్కసారైనా ఈ ప్రతిష్టాత్మకమైన కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శిస్తే, మోక్షం పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నమ్ముతారు.

Kashi Vishwanath

శివుని పూజించడానికి ప్రధాన కారణం:
కాశీలో ఆ మహాశివుడు కొలువుదీరడానికి గురించి తెలిపే ఎన్నో కథలు ఉన్నాయి. గంగానది ఒడ్డున ఉన్న ప్రసిద్ధ మణిచర్ణికా ఘాట్, శక్తి పీఠంగా పిలిచే కాశీ విశ్వనాథ ఆలయానికి చాలా సమీపంలో ఉంటుంది. ప్రసిద్ధ జ్యోతిర్లింగ శివుని శక్తి, బలం, చివరి ప్రకాశం కోసం భక్తులు పూజలు నిర్వహిస్తుంటారు. మహాశివుని భార్య సతీదేవి మరణం తరువాత, శివుడు మణికర్ణిక నుండి కాశీ విశ్వనాథానికి చేరుకున్నాడని పురాణాలు పేర్కొంటున్నాయి.

publive-image

ఇది కూడా చదవండి: కాశీ నగరం గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు.. వాచ్‌ లైవ్!

Advertisment