KTR: చంద్రబాబు సర్కార్‌ రెస్క్యూ ఆపరేషన్ చేపడుతోంది... రేవంత్ ప్రభుత్వం చేసింది జీరో

పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో?..బిగ్‌ జీరో అంటూ బీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌ మండిపడ్డారు.

KTR : నీతి ఆయోగ్ నివేదికపై కేటీఆర్ హర్షం.. కేసీఆర్ కృషి ఫలితమే అంటూ!
New Update

KTR: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, తీసుకుంటున్న చర్యలు గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. అదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ ని పోస్ట్‌ చేశారు.

పొరుగు రాష్ట్రం ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం 6 హెలికాప్టర్లు, 150 రెస్క్యూ బోట్లతో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టింది, కానీ ఇక్కడ తెలంగాణ సీఎం ఎన్ని హెలికాప్టర్లు, ఎన్ని బోట్లతో ఎంతమంది ప్రాణాలు కాపాడారో? అంటూ విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కాపాడింది 'బిగ్ జీరో' అని ట్విట్టర్లో రాసుకొచ్చారు.

publive-image

వరదల నేపథ్యంలో ప్రజలకు సహాయక చర్యలు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ఫెయిలయ్యిందని కేటీఆర్ విమర్శించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వరదలో ఖమ్మంలో రాణి గారు, వారి ముగ్గురు పిల్లలు చిక్కుకుంటే ప్రభుత్వం స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధిర నుంచి ఆమె బంధువులు గజఈతగాళ్లని రప్పించి వారే ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.

ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంటే... ఒక జేసీబీ డ్రైవర్ సోదరుడు తన ప్రాణాలకు తెగించి తొమ్మిది మంది ప్రాణాలను కాపాడిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ధైర్యం చెప్పి రక్షించాల్సిన మంత్రులే దేవుడే దిక్కు అంటూ చేతులెత్తేశారని మండిపడ్డారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వరద బాధితులకు రూ.25 లక్షల నష్టపరిహారం డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రూ.5 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటారా? అంటూ ప్రశ్నించారు. ప్రతిపక్షాలు ఎన్ని ప్రజా సమస్యలు ఎత్తిచూపినా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. వరదలతో సతమతమవుతున్న ప్రజలు సాయం కోరితే లాఠీఛార్జ్ చేస్తారా? సిగ్గు తెచ్చుకోండి... సీఎంగారూ! అని కేటీఆర్‌ మండిపడ్డారు.

Also Read: కృష్ణానది కరకట్ట లీకేజీకి అడ్డుకట్ట.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు!

#NULL
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe