అమెరికాలో మళ్లీ కాల్పులు..మెక్సికో ఇండస్ట్రియల్ హబ్లో 6గురి కాల్చివేత..!! అమెరికాలో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. గత మూడునాలుగు రోజులుగా జరుగుతున్న కాల్పులు ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. తాజాగా మెక్సికోలో ఆరుగురిని కాల్చి చంపారు. మృతదేహాలను వారి ఇళ్ల ముందు వదిలేశారు. మృతదేహాల్లో ఎక్కువమందివి కాళ్లు, చేతులు కట్టేసి ఉన్నాయి. అర్ధరాత్రి తుపాకీ శబ్దాలు విన్నట్లు స్థానికులు తెలిపారు. మోంటెర్రే అనేది యుఎస్ సరిహద్దు నుండి 160 కిలోమీటర్లు (100 మైళ్ళు) దూరంలో ఉన్న న్యూవో లియోన్ రాష్ట్రంలో ఒక పారిశ్రామిక పవర్‌హౌస్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. By Bhoomi 05 Jul 2023 in క్రైం ఇంటర్నేషనల్ New Update షేర్ చేయండి అమెరికాలోని మెక్సికో పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. ఈశాన్య మెక్సికన్ నగరంలో మోంటెర్రీలో ఇద్దరు మహిళలు సహా ఆరుగురు వ్యక్తులను కాల్చి చంపారు గుర్తుతెలియని దుండగులు. మంగళవారం అర్థరాత్రి తుపాకీ కాల్పుల చప్పుళ్లు విన్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాలు వారి ఇళ్ల ముందు వదిలేశారు. వారిలో ఎక్కువ మంది చేతులు కట్టివేసి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మోంటెర్రే అనేది యుఎస్ సరిహద్దు నుండి 160 కిలోమీటర్లు (100 మైళ్ళు) దూరంలో ఉన్న న్యూవో లియోన్ రాష్ట్రంలో ఒక పారిశ్రామిక పవర్‌హౌస్ ప్రాంతంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 2006లో మాదకద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కొనే సైనిక చర్యను ప్రారంభించనప్పటి నుంచి మెక్సికోలో ఇప్పటివరకు దాదాపు 350,000కంటే ఎక్కువగా హత్యలు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు. అంతకుముందు సోమవారం రాత్రి ఫిలడెల్ఫియాలో జరిగిన కాల్పుల్లో నలుగురు చనిపోయారు . స్థానికుల సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు కస్టడీలో ఉన్నాడని పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. ఘటనా స్థలం నుంచి రైఫిల్, తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఎన్‌క్వైరర్, ABC న్యూస్ అనుబంధ సంస్థలు ఇద్దరు టీనేజర్లు కూడా కాల్పులకు గురయ్యారని నివేదించాయి. అటు సోమవారం, ఈశాన్య రాష్ట్రమైన తమౌలిపాస్ ప్రాంతం హింసాత్మకంగా మారింది. భద్రతా మంత్రి హెక్టర్ జోయెల్ విల్లెగాస్ పై కాల్పులు జరిగాయి. ఆయన కాల్పుల నుంచి సురక్షితంగా బయటపడినట్లు అధికారులు తెలిపారు. మంత్రికి భద్రతను పెంచామని...దీంతో మంగళవారం నుంచి తన కార్యకలాపాలను కొనసాగించారని వారు తెలిపారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి