Mantralayam: మంత్రాలయం స్వామిని దర్శించకోకుండా వెనుదిరిగిన 500 మంది భక్తులు..ఎందుకంటే!

కర్నూలు జిల్లాలోని మంత్రాలయం రాఘవేంద్ర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన 500 మంది భక్తులు..తమ ఆర్గనైజర్‌ మరణించడంతో దర్శనం చేసుకోకుండానే వెనుదిరిగారు. ఆర్గనైజర్ వీరభద్రారెడ్డి మంత్రాలయం శివారులో రోడ్డు ప్రమాదంలో మరణించాడు.

Mantralayam: మంత్రాలయం స్వామిని దర్శించకోకుండా వెనుదిరిగిన 500 మంది భక్తులు..ఎందుకంటే!
New Update

కర్నూలు(Kurnool)  జిల్లాలోని మంత్రాలయం (Mantralayam) రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవడానికి కర్ణాటక (Karnataka) నుంచి సుమారు 500 మంది భక్తులు వచ్చారు. మరి కొద్ది సేపట్లో స్వామి దర్శనం అవుతుంది అనగా ..500 మంది కూడా వెనుదిరిగి వెళ్లిపోయారు. వారిలో ఒక్కరు కూడా స్వామిని దర్శించుకోలేదు. అసలు వారంతా వెనక్కి తిరిగి వెళ్లడానికి గల కారణం ఏంటంటే..వారందరినీ తీసుకుని వచ్చిన ఆర్గనైజర్‌ (Organiser) రోడ్డు ప్రమాదంలో(Road accident)  చనిపోవడమే.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటక లోని బళ్లారి జిల్లా సిరిగుప్ప మండలం కరూర్‌ కు చెందిన వీర భద్రా రెడ్డి (40) గత కొంతకాలంగా పాదయాత్ర ఆర్గనైజర్‌ గా వ్యవహరిస్తున్నారు. కరూర్‌ గ్రామం నుంచి 500 మంది భక్తులతో ఆయన అప్పుడప్పుడు మంత్రాలయానికి పాదయాత్రగా వస్తుంటాడు.

Also read: కాసేపట్లో ఢిల్లీకి లోకేష్‌..హైదరాబాద్‌ ఆసుపత్రికి బాబు!

ఎప్పటిలాగానే ఈ సారి కూడా సుమారు 500 మంది భక్తులతో ఆయన మంత్రాలయానికి వచ్చారు. బుధవారం తెల్లవారుజామున మరి కాసేపట్లో స్వామి వారి సన్నిధికి చేరుకుంటాం అనగా..వీరభద్రా రెడ్డిని ఆటో ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఆయన వెంట వచ్చిన భక్తులంతా కూడా విషాదంలో మునిగిపోయారు.

వీరభద్రారెడ్డి మరణించడంతో ఆ బాధలోనే భక్తులంతా కూడా రాఘవేంద్ర స్వామిని దర్శించుకోకుండానే స్వగ్రామానికి బయల్దేరారు. 20 సంవత్సరాలుగా వీరభద్రారెడ్డి సోదరుడు ప్రకాశ్‌ రెడ్డి ఇలా భక్తులతో పాదయాత్రగా మంత్రాలయానికి వచ్చేవారు. ఆయన 8 సంవత్సరాల క్రితం మరణించారు.

దాంతో పాదయాత్ర బాధ్యతను వీరభద్రారెడ్డి తీసుకుని భక్తులను తీసుకుని వస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన మృత్యువాత పడ్డారు. ఆయనకి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also read: అగ్రరాజ్యంలో తెలంగాణ విద్యార్థి పై దాడి..పరిస్థితి విషమం!

#kurnool #mantralayam #organiser
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe