50 Fake Doctors: నకిలీ డాక్టర్లపై తెలంగాణ వైద్య మండలి కొరడా విధించింది. తెలంగాణ వైద్య మండలి సభ్యులు ఐడీపీఎల్(IDPL), చింతల్ (Chintal), షాపూర్‌నగర్ (Shapurnagar) ప్రాంతాల్లో నిర్వహించిన తనిఖీల్లో 50 మంది నకిలీ డాక్టర్లను గుర్తించారు. ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా ఒకేసారి తనిఖీలు నిర్వహించారు. నకిలీ డాక్టర్లు తమ ఆరోగ్య కేంద్రాల్లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్(Antibiotics) ఇస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
Also Read: బాచుపల్లి హత్య కేసులో షాకింగ్ నిజాలు.. సుత్తి, కత్తి సాయంతో కాలు, చేయిని సగం వరకు నరికి..!
తాము వైద్యులుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాకుండా, వారికి అనుసంధానంగా మెడికల్ షాపులు, డయాగ్నొస్టిక్ సెంటర్లు కూడా పెట్టుకున్నారని అధికారులు తెలిపారు. దాదాపు 50 మంది నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసినట్లు తెలిపారు. ఇద్దరిని జైలుకు కూడా పంపినట్లు వెల్లడించారు. తనిఖీల్లో డాక్టర్ ప్రతిభాలక్ష్మి, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ ఇమ్రాన్ అలీ, డాక్టర్ కే. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు.