Big Breaking: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత!

తిరుమల కొండపై ఆపరేషన్ చిరుత ముగిసింది. ఈ నెల 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి తర్వాత టీటీడీ అప్రమత్తం అవ్వడం.. వరుస పెట్టి మూడు చిరుతలను బోనులో బంధించడం చకచకా జరిగిపోయాయి. గత జూన్‌ 24న మొదటి చిరుత, ఆగస్ట్‌ 14న రెండో చిరుత, ఆగస్ట్‌ 17న మూడో చిరుత చిక్కగా..తాజాగా నాలుగో చిరుత కూడా బోనులో పడింది.

New Update
Big Breaking: అలిపిరి కాలినడక మార్గంలో బోనులో చిక్కిన నాలుగో చిరుత!

అలిపిరి కాలినడక మార్గంలో నాలుగో చిరుత బోనులో చిక్కింది. ఎట్టకేలకు అనేక వ్యయప్రయాసాల అనంతరం నాలుగో చిరుత చిక్కింది. ఆగష్టు 15నే ఈ నాలుగో చిరుత సంచారాన్ని అటవీశాఖ గుర్తించింది. ఆగష్టు 15 నుంచి నిరంతరంగా ఆపరేషన్ చిరుత కొనసాగించారు. ఇక నాలుగో చిరుత కూడా చిక్కడంతో నేటితో నడకమార్గంలో సంచరిస్తున్న చిరుతల బెడదకు చెక్ పడిందని అంతా భావిస్తున్నారు. నిన్న రాత్రి అలిపిరి కాలినడక మార్గంలో 7వ మైలు రాయి దగ్గర చిరుతపులి బోనులో చిక్కింది. దీంతో.. ఆపరేషన్ చిరుత విజయవంతంగా ముగిసిందని అధికారులు తెలిపారు.

లక్షిత మృతి తర్వాత వేగంగా మారిన పరిణామాలు:
తిరుమలలో చిరుతల సంచారం గతంలో ఉన్నా ఈ నెల 11న ఆరేళ్ల చిన్నారి లక్షిత మృతి చెందిన తర్వాత అధికారులు అప్రమత్తమయ్యారు. లక్షిత మృతి తర్వాత అన్నివైపుల నుంచి టీటీడీపై అనేక విమర్శలు వచ్చాయి. అంతకముందు కూడా కౌశిక్ అనే బాలుడిని చిరుత గాయాలు పాలు చేయడం టీటీడీపై విమర్శల దాడి పెరగడానికి ప్రధాన కారణం. ఇలా వరుస పెట్టి ఘటనలు జరుగుతుండడంతో టీటీడీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇక మహారాష్ట్ర నుంచి స్పెషల్‌గా బోనులను తెప్పించింది. వాటిలోనే చిరుతపులులు చిక్కాయి. తాజాగా నాలుగో చిరుత కూడా చిక్కడంతో ఈ మృగం బెడద తప్పినట్టేనని అధికారులు భావిస్తున్నారు.

లక్షిత మృతి తర్వాత ఏం జరిగింది:
అటవీ శాఖ శిక్షణ పొందిన సిబ్బందితో బోనులను ఏర్పాటు చేసింది టీటీడీ. ఈ మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు దాదాపు 500 సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసింది. కొండపై ఉన్న ఆలయానికి పిల్లలతో ట్రెక్కింగ్ చేసే తల్లిదండ్రులు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ సంస్థ విజ్ఞప్తి చేసింది.

ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డి పాలెం గ్రామానికి చెందిన లక్షిత తన కుటుంబంతో కలిసి అలిపిరి మార్గంలో తిరుమలకు పాదయాత్ర చేస్తూ ఆగస్టు 11 రాత్రి 7.30 గంటల ప్రాంతంలో కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు దినేష్, శశికళ ఆమె కోసం ఎంత వెతికినా టీటీడీ అధికారులను అప్రమత్తం చేశారు. స్థానిక పోలీసులు, అటవీ శాఖ సిబ్బందితో కలిసి టీటీడీ విజిలెన్స్‌, సెక్యూరిటీ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టగా తర్వాతి రోజు ఉదయం నరసింహస్వామి ఆలయం వెనుక బాలిక మృతదేహాన్ని గుర్తించారు. లక్షిత శరీరంపై గాయాలను పరిశీలించిన అటవీ సిబ్బంది చిరుత దాడి వల్లే చనిపోయిందని తేల్చారు.

ముగిసిన ఆపరేషన్ చిరుత?
నిజానికి ఆగస్ట్‌ 15న నాలుగో చిరుత సంచారాన్ని అధికారులు గుర్తించారు. ఆగస్ట్‌ 15 నుంచి నిరంతరాయంగా ఆపరేషన్‌ చిరుత చేస్తుండగా.. తాజాగా నాలుగో చిరుత కూడా చిక్కింది. జూన్‌ 24న మొదటి చిరుత, ఆగస్ట్‌ 14న రెండో చిరుత, ఆగస్ట్‌ 17న మూడో చిరుత చిక్కింది. ఇక తాజాగా నాలుగో చిరుత కూడా చిక్కడంతో ఇవాళ్టితో నడకమార్గంలో చిరుతల బెడదకు చెక్‌ పడినట్టుగానే అధికారులు భావిస్తున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు