తెలంగాణలో సూర్యుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటల నుంచే భానుడు విజృభిస్తుండడంతో ప్రజలేవరు బయట కనిపించడం లేదు. నిత్యం 42 నుంచి 45 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా తయారయ్యింది.
ఉదయం నుంచే ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఆదివారం సాయంత్రం వాతావరణశాఖ విడుదల చేసిన నివేదికల ప్రకారం..తెలంగాణలో ఏకంగా ఆరు జిల్లాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు దాటిపోయాయి. ఆ ఆరు జిల్లాలు కూడా రెడ్ జోన్ లో చేరిపోయాయి. రెడ్ జోన్ అంటే వడగాలులు తీవ్రంగా వీచే అవకాశాలున్నట్లు.
అత్యధికంగా నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో 45.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవ్వగా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో 45. 3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ములుగు, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో 45 డిగ్రీలు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో 42.7 డిగ్రీలు నమోదు అయ్యాయి.
రాష్ట్రంలో 42 డిగ్రీలే అతి తక్కువ ఉష్ణోగ్రతలు అని అధికారులు చెప్పే స్థాయికి వచ్చారు అంటే రాష్ట్రంలో ఎండ వేడి ఏ విధంగా ఉందో తెలుస్తుందో. రాష్ట్రంలోని సుమారు 15 మండలాలు రెడ్ జోన్ లో చేరాయి. గతేడాది అదే జోన్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత 33 డిగ్రీలుగా ఉండగా.. ఈ సారి ఏకంగా 10 డిగ్రీలు పెరగడం గమనార్హం.
నిరుడు ఏప్రిల్ 28వ తేదీకి, ఆదివారం నమోదైన ఉష్ణోగ్రతలను పోల్చి చూస్తే ఎంతో వ్యత్యాసం కనిపిస్తున్నది. గతేడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు 40.9 డిగ్రీలు మాత్రమే నమోదు అయ్యాయి.
Also read: ఆరో దశ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల