TSPSC: టీఎస్పీఎస్సీకి 40కోట్లు నిధులు..ఉద్యోగాల భర్తీకి కసరత్తులు షురూ..!!

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు 40కోట్ల నిధులను విడుదల చేసింది ప్రభుత్వం. ఈ మేరకు తెలంగాణ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. టీఎస్పీఎస్సీ అవసరాలతోపాటు, కొత్త ఉద్యోగాల భర్తీకి ఈ నిధులు సహకారం కానున్నాయి.

TSPSC: గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌పై టీఎస్‌పీఎస్సీ కీలక ప్రకటన ..పరీక్ష తేదీ ఖరారు.!
New Update

TSPSC - 40 Crore Funds: గత ప్రభుత్వంలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ద్రుష్టిలో ఉంచుకుని మరోసారి అలాంటి తప్పు జరగకుండా ఉండేందుకు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ (Congress) సర్కార్ ముందుకు సాగుతోంది. గత ప్రభుత్వం హయాంలో టీఎస్పీఎస్సీలోని (TSPSC) లోపాలను సరిదిద్దేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు టీఎస్పీఎస్సీ ప్రక్షాళనను చేపట్టింది. ఈ క్రమంలోనే కొత్త కమిటీని ఏర్పాటు చేసి...దానికి చైర్మన్ ను, కొత్త సభ్యులను నియమించింది.

ఇది కూడా చదవండి: ఇక నుంచి శరద్ పవార్ పార్టీ పేరు ఇదే..!!

ప్రస్తుతం కొత్త ఏర్పడిన టీఎస్ పీఎస్సీ కొత్త ఉద్యోగాల ప్రక్రియను (New Recruitments) చేపట్టేందుకు అన్ని శాఖల నుంచి ఖాళీల వివరాలను సేకరించే పనిలో ఉంది. రాష్ట్రంలో ఖాళీల పూర్తి వివరాలు అందిన తర్వాత కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ప్రభుత్వ కసరత్తు చేస్తోంది. దీనిలో భాగంగానే టీఎస్పీఎస్సీకి నిధులు రిలీజ్ చేసింది. ఈ మేరకు తెలంగాణ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది. బడ్జెట్ కేటాయింపుల నుంచి 40కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ నిధులు టీఎస్పీఎస్సీ అవసరాలతోపాటు కొత్త ఉద్యోగాల భర్తీకి సహకారం కానున్నాయి. నిధులు ఇవ్వాలని టీఎస్పీఎస్సీ కొంతకాలంగా ప్రభుత్వాన్ని కోరుతూనే ఉంది. సంస్థ పూర్తి ప్రక్షాళన తర్వాత నిధులు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి:  కనీసం పంట నష్ట పరిహారం కూడా ఇవ్వలేని దిక్కుమాలిన ప్రభుత్వం: షర్మిల!

#tspsc #funds-released
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe