తమిళ నటుడు వద్ద 40 బుల్లెట్లు స్వాధీనం!

చెన్నై ఎయిర్ పోర్టులో తిరుచ్చి వెళుతున్న తమిళ నటుడు కరుణాస్ వద్ద నుంచి ఎయిర్ పోర్టు భద్రతా సిబ్బంది 40 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.అయితే ఆయన వద్ద ఉన్న బులెట్లు లైసన్స్ వా కాదా అని అధికారులు విచారణ చేపట్టారు.

New Update
తమిళ నటుడు వద్ద  40 బుల్లెట్లు స్వాధీనం!

చెన్నై నుంచి తిరుచ్చి వెళ్లేందుకు నటుడు కరుణాస్ ఈరోజు చెన్నై విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ అధికారులు అతడి హ్యాండ్‌బ్యాగ్‌ని సోదా చేయగా అతని వద్ద 40 బుల్లెట్లు గుర్తించారు.దీంతో షాక్‌కు గురైన భద్రతా బలగాలు వెంటనే అతడి వద్ద నుంచి 40 కాట్రిడ్జ్‌లను స్వాధీనం చేసుకున్నారు.దీంతో ఆయన తిరుచ్చి పర్యటనను  రద్దు చేసుకున్నారు. ఈ కేసులో కరుణాస్‌కు బుల్లెట్లు ఎలా వచ్చాయన్న కోణంలో పోలీసులు క్షుణ్ణంగా విచారణ చేపట్టారు.

ఈ కేసులో, అతని వద్ద లైసెన్స్ తుపాకీ  ఉందని ఆయన అధికారులతో పత్రాలు సమర్పించారు.ఇటీవలె జరిగిన ఎన్నికల సమయంలో తుపాకీని  దిండిగల్ జిల్లా పోలీస్ స్టేషన్‌ లో ఇచ్చినట్టు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు