BREAKING: ఏపీలో ఫుడ్ పాయిజన్‌ కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి!

AP: అనకాపల్లి కైలాసపట్నంలోని అనాథ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌‌తో నలుగురు విద్యార్థులు మృతి చెందడం కలకలం రేపుతోంది. మరో ఇద్దరి పరిస్థితి విషంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఫుడ్ పాయిజన్‌తో మరో 27 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలకు గురవడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

New Update
BREAKING: ఏపీలో ఫుడ్ పాయిజన్‌ కలకలం.. నలుగురు విద్యార్థులు మృతి!

Food Poison: అనకాపల్లి జిల్లాలోని అనాథ పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ కలకలం రేపింది. కైలాసపట్నంలోని అనాథ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 27 మంది విద్యార్థులకు వాంతులు, విరేచనాలు జరిగాయి. విద్యార్థులను నర్సీపట్నం ఏరియా హాస్పిటల్, విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు విద్యార్థులు.

పరిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో ఈ అనాథ పాఠశాలను నిర్వహిస్తున్నారు. స్కూల్‌లో మొత్తం 86 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. విషయం తెలుసుకున్న అధికారులు ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఇది ఎలా జరిగిందన్న కోణంలో ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లో ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు