విరిగి పడిన కొండచరియలు.... నలుగురి మృతి...!

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్‌లో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు అధికారులు వెల్లడించారు.

విరిగి పడిన కొండచరియలు.... నలుగురి మృతి...!
New Update

ఉత్తరాఖండ్‌లో విషాదం చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్‌లో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు అధికారులు వెల్లడించారు.

కేదార్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్తున్న భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు పేర్కొన్నారు. కేదార్ నాథ్ పుణ్య క్షేత్రానికి 15 కిలో మీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో ధ్వంసమైన దుకాణాలు, హోటళ్ల శిథిలాలు ఉధృతంగా ప్రవహిస్తున్న మందాకిని నదిలో పడిపోతున్నాయని పేర్కొన్నారు.

బాధితులు ఆకస్మిక వరదలో కొట్టుకు పోయారా లేదా శిథిలాల కింద చిక్కుకు పోయారా అనే విషయంలో స్పష్టత రాలేదన్నారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్న సమయంలో నలుగురు మృత దేహాలు లభించినట్టు జిల్లా కలెక్టర్ సౌరవ్ గహర్వార్ వెల్లడించారు. మరి కొంత మంది ఆచూకీ తెలియాల్సి వుందన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ను సీఎం పుష్కర్ సింగ్ ధామీ పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేయాలని అధికారులను సీఎం ధామీ ఆదేశించారు. వరదలు సంభవించే ప్రాంతాల్లో అలర్ట్ ప్రకటించాలని సూచించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి