ముంబైలో దళితులను చెట్టుకు వేలాడదీసిన కేసులో నిందితులు అరెస్ట్ దేశంలో దళితులపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్.. నిన్న ఉత్తరప్రదేశ్.. నేడు మహారాష్ట్ర.. ఎక్కడ చూసినా బలహీనవర్గాలపై అవమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో నలుగురు దళితులను చెట్టుకుని వేలాడదీసి ఘోరం కొట్టిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. By BalaMurali Krishna 29 Aug 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి దేశంలో దళితులపై దాడులు ఆగడం లేదు. మొన్న మధ్యప్రదేశ్.. నిన్న ఉత్తరప్రదేశ్.. నేడు మహారాష్ట్ర.. ఎక్కడ చూసినా బలహీనవర్గాలపై అవమానవీయ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లో దొంగతనం చేశారనే అనుమానంతో దళితులను చెట్టుకు వేలాడదీసి ఘోరంగా కొట్టిన ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. అహ్మద్‌నగర్‌లోని శ్రీరాంపూర్ తాలూకాలోని హరేగావ్ గ్రామంలో మేకను, కొన్ని పావురాలను దొంగిలించారనే అనుమానంతో.. నలుగురు దళిత వ్యక్తులను ఆరుగురు వ్యక్తులు చెట్టుకు తలకిందులుగా వేలాడదీసి, కర్రలతో కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రతిపక్ష నేతలు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆసుపత్రిలో బాధితులను పరామర్శించారు. ఆగస్టు 25న, గ్రామానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ఆ నలుగురి ఇళ్లకు వెళ్లి వారిని బలవంతంగా తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ ఆరుగురిలో పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా.. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు. నిందితులను యువరాజ్ గలాండే, మనోజ్ బోడకే, పప్పు పార్కే, దీపక్ గైక్వాడ్, దుర్గేష్ వైద్య, రాజు బొరాగేగా గుర్తించారు. ఈ ఘటనకు నిరసనగా ఆదివారం శ్రీరాంపూర్ లోని హరేగావ్ గ్రామంలో బంద్ పాటించారు. ఈ ఘటన మానవత్వానికి మచ్చ అని, దీన్ని బీజేపీ స్ప్రెడ్ చేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు సెక్షన్ 307, 364 ఇతర షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. బాధితులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు వెల్లిడించారు. Your browser does not support the video tag. మరోవైపు మధ్యప్రదేశ్ సాగర్ జిల్లాలోనూ అత్యంత అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దళిత మహిళను నగ్నంగా చేసిన దుండగులు..ఆమె కుమారుడిని చంపేశారు. 2019లో జరిగిన బాధిత మహిళ కూతురికి సంబంధించిన లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో..ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ ఘటనలో 8మంది అరెస్ట్ అయ్యారు. బాధిత మహిళ ఇంటిపై దాడి చేసిన దుండగులు..అత్యంత కిరాతకంగా ప్రవర్తించారు. ఇంటిని పూర్తిగా ధ్వంసం చేసి ఆమె కుమారుడిని దారుణంగా కొట్టారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన తల్లిని వివస్త్రను చేశారు. దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె కుమారుడు ప్రాణాలు కోల్పోయాడు. ఐనా సరే అంతటితో ఆగని దుండగలు..దళిత మహిళకు ఉన్న మరో ఇద్దరి కుమారుల కోసం గాలించారు. గ్రామంలో ఇంటింటికీ తిరిగారు. మహిళ బంధువుల ఇంట్లోకి చొరబడి విధ్వంసం సృష్టించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు..సంబంధిత గ్రామానికి వెళ్లి నగ్నంగా ఉన్న మహిళకు బట్టలు ఇచ్చారు. ఈ దారుణ ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో భారీగా బలగాలను మోహరించారు. మరోవైపు 9 మందిపై మర్డర్ కేసు పెట్టిన పోలీసులు..ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. ఇప్పటివరకు 8మందిని అరెస్ట్ చేశారు. మరికొందరి కోసం గాలిస్తున్నారు. ఈ దారుణ ఘటనపై ప్రధాని మోదీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌పై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మండిపడ్డారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి