Fact Check: గిరిజనుడి ముఖంపై మూత్రం ఘటనలో అనేక వార్తలు చక్కర్లు..అసలు నిజమేంటి..?

మధ్యప్రదేశ్‌ సిధి జిల్లాలో గిరిజనుడి ముఖంపై ప్రవేశ్‌ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటనపై దుమారం చెలరేగుతూనే ఉంది. తాజాగా వీడియోలో ఉన్నది తాను కాదు అని బాధితుడిగా భావిస్తోన్న రావత్‌ చెప్పడం సంచలనం సృష్టించింది. అయితే వీడియోని ట్రిమ్‌ చేశారని పోలీసులు చెబుతున్నారు.

New Update
Fact Check: గిరిజనుడి ముఖంపై మూత్రం ఘటనలో అనేక వార్తలు చక్కర్లు..అసలు నిజమేంటి..?

'కనపడిన వాళ్లందరికి కాళ్లు కడుగుతారా'..? 'ఆ కాళ్లు మూత్రం బాధితుడివి కాదా'..? ప్రస్తుతం ఈ రెండు ప్రశ్నలతో బీజేపీపై కాంగ్రెస్‌ సోషల్‌మీడియాలో మండిపడుతోంది. మధ్యప్రదేశ్‌ సిధి జిల్లాలో గిరిజనుడి ముఖంపై ప్రవేశ్‌ శుక్లా అనే వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా..ఈ కేసులో రోజుకో కొత్త వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ కేసులో బాధితుడిగా భావిస్తోన్న దశమత్ రావత్ మాట్లాడిన ఓ వీడియో వైరల్‌గా మారింది. సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ కార్యకర్తలు, నేతలు ఎక్కువగా షేర్‌ చేసిన ఈ వీడియో చూసిన తర్వాత ప్రజలు అయోమయంలో పడ్డారు. అసలు ప్రవేశ్‌ శుక్లా మూత్రం పోసింది తనపై కాదు అని.. తనలో అలా బలవంతంగా సంతకం పెట్టించారంటూ ఈ వీడియోలో రావత్‌ చెప్పడం కనిపించింది. దీంతో సీఎం కాళ్లు కడిగింది అసలు బాధితుడికి కాదని.. ఇదంతా పబ్లిసిటీ స్టంట్‌ అని కాంగ్రెస్‌ ఎదురుదాడికి దిగింది. అయితే ఈ వీడియోలో అసలు నిజమెంతా..?

వీడియోని ట్రిమ్ చేశారా..?
ఈ మధ్యకాలంలో సోషల్‌మీడియాలో సెలక్టివ్‌ క్లిప్స్‌ దర్శనమిస్తున్నాయి. అంటే ఎవరి ప్రాపగాండకు తగ్గట్టు వీడియోని కొంతవరకు కట్‌ చేసి పోస్ట్ చేస్తున్నారు. రాజకీయనాయకులు, సెలబ్రిటీలు మాట్లాడిన వ్యాఖ్యలను పూర్తిగా పెట్టకుండా సగం, సగం పెట్టి.. ఆ సగం, సగం వీడియోని మెర్జ్‌ చేసి నెట్టింట్లో వదులుతున్నారు. దీంతో అసలు నిజమెంటన్నది అర్థంకాని దుస్థితి దాపరిచింది. తాజాగా మూత్రం బాధితుడు రావత్‌ వీడియోలోనూ అదే జరిగినట్టు పలు ఫ్యాక్ట్ చెక్‌ వెబ్‌సైట్లు చెబుతున్నాయి.


రావత్‌ ఏం చెప్పాడంటే:
ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అని రావత్‌ చెప్పినట్టుగా వీడియోలో కనిపిస్తోంది. అయితే రావత్‌ చెప్పింది అసలు విషయం అది కాదట. విచారణకు పిలిచిన సమయంలో తాను తాగి ఉన్నానని.. ఘటన జరిగిన సమయంలోనూ తాగే ఉన్నట్టు రావత్‌ చెబుతున్నాడు. అందుకే ఈ వీడియోలో ఉన్నది తాను కాదు అని ముందుగా భావించాడట...! నిజానికి ఈ ఘటన 2020 కరోనా టైమ్‌లో జరిగింది. మూడేళ్ల తర్వాత ఈ వీడియో బయటకు వచ్చింది. తానే యూరిన్‌ చేసినట్టు ప్రవేశ్‌ శుక్లా ఇప్పటికీ అంగీకరించగా.. తాగిన మత్తులో ఉన్న తనపై మూత్రం పోసింది ఎవరన్నది గుర్తులేదని రావత్‌ చెబుతున్నాడు. అయితే రావత్‌ వైఫ్‌ మాత్రం వీడియోలో ఉన్నది తన భర్తేనని తెలిపింది. ఘటన జరిగిన సమయంలో నిందితుడు, బాధితుడు ఇద్దరూ తాగిన మైకంలో ఉన్నారని పోలీసులు క్లారిటీ ఇస్తున్నారు. ' వీడియోలో ఉన్నది నేను కాదు' అని ముందుగా భావించినట్టు రావత్‌ చెప్పిన వీడియోని ట్రిమ్‌ చేసినట్టు ఫ్యాక్ట్ చెక్‌ వెబ్‌సైట్లు చెబుతున్నాయి. అటు పోలీసులు కూడా సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారంలో ఏ మాత్రం వాస్తవం లేదు అని.. వీడియోలో ఉన్న వ్యక్తి రావతేనని తేల్చారు.

మరోలా కాంగ్రెస్‌ కార్యకర్తల వెర్షన్:
అయితే ఫ్యాక్ట్ చెక్‌ వెబ్‌సైట్లు క్లైయిమ్‌ చేస్తున్న వాటిని సోషల్‌మీడియాలో కాంగ్రెస్‌ మద్దతుదారులు ఒప్పుకోవడంలేదు. వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి రావత్‌ కాదని చెబుతున్నారు. ఇద్దరికి ఏజ్‌లో గ్యాప్‌ స్పష్టంగా కనిపిస్తుందంటున్నారు. దీనికి సంబంధించి పలు పోస్టులు షేర్‌ చేస్తుండగా..అవి వైరల్‌గా మారాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చిన మరుక్షణం నుంచే దీనిపై రాజకీయం దుమారం చేలరేగింది. కాంగ్రెస్‌ విమర్శలు ఎక్కువ అవ్వడంతో స్వయంగా సీఎం రంగంలోకి దిగారు. బాధితుడిగా భావిస్తోన్న రావత్‌ కాళ్లను కడిగారు.. అది కూడా ఇంటికి పిలిపించుకోని మరి ఈ పని చేశారు. అయితే ఆ వీడియోలో ఉన్నది తాను కాదని ఓ వీడియో దర్శనం ఇవ్వడం.. పోలీసులు.. ఫ్యాక్ట్ చెక్‌వెబ్‌సైట్లు మాత్రం ఆ వీడియోని ట్రిమ్‌ చేశారని చెబుతుండడంతో అసలు నిజమేంటన్నదానిపై ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు